సీనియర్ హీరో శరత్‌కుమార్‌ను వివాదాల మీద వివాదాలు వెల్లువెత్తుతున్నాయి. విశాల్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో ఇవి మొదలయ్యాయి. ఇప్పటికే నడిగర్ సంఘానికి చెందిన పలు నిధులను ఆయన దుర్వినియోగం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. మరోపక్క దీనిపై కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. కోర్టులో ఈ ఆరోపణలు రుజువుకావడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే శరత్‌కుమార్ జైలు ఊచలు లెక్కపెట్టడం తధ్యమంటున్నారు.
మరోపక్క ఈయన అకస్మాత్తుగా శశికళకు మద్దతు ప్రకటించాడు. పనిలో పనిగా తాజాగా రద్దయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఆయన శశికళ వర్గానికి చెందిన దినకరన్‌కు ప్రచారం కూడా చేస్తానన్నాడు. దీంతో ఆయన చుట్టూ వివాదాలు మరోసారి అలుముకున్నాయి. తమిళ ప్రజల్లో ఆయనపై ఆగ్రహం పెల్లుబికుతోంది. మరోపక్క ఒక విధంగా పన్నీరుసెల్వంకు మద్దతుగా ప్రవర్తిస్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ కూడా ఆయనపై గుర్రుగానే ఉందంటున్నారు.
తాజాగా ఈ ఉప ఎన్నికల సందర్భంగా శరత్‌కుమార్ వాహనంలో లక్షల కొద్ది డబ్బు దొరికింది. ఇది ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి తీసుకుని వెళ్తున్న డబ్బేనని ఐటి అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐటి చేతుల్లో కూడా శరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలే ఉన్నాయంటున్నారు. మరి ఈ కేసు కూడా ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో ఈ హీరో పరిస్థితి ఒకప్పటి ఆయన విలన్ పరిస్థితిని గుర్తుకు తెస్తోంది.