Advertisementt

పవన్‌ వైపు అనుమానపు చూపులు...!

Tue 11th Apr 2017 04:53 PM
pawan kalyan,gaddar,telangana tdp,jana sena party  పవన్‌ వైపు అనుమానపు చూపులు...!
పవన్‌ వైపు అనుమానపు చూపులు...!
Advertisement
Ads by CJ

పవన్‌ ఏపీలో బిజెపిని తెగ తిడుతున్నా కూడా చంద్రబాబును, టిడిపిని పెద్దగా టార్గెట్‌ చేయకపోవడం ఎప్పటి నుంచో పలు అనుమానాలకు దారి తీస్తోంది. పవన్‌ టిడిపిని ఇన్‌డైరెక్ట్‌గా సపోర్ట్‌ చేస్తూ... దానిని మరోసారి అధికారంలోకి తేవడానికే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే ఓ కోవర్ట్‌లా బిహేవ్‌ చేస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా పవన్‌ పార్టీని తెలంగాణలో గద్దర్‌ నడిపే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయన భావసారూప్యం ఉన్న పార్టీలన్నింటినీ ఐక్యం చేస్తానంటున్నాడు. దీంతో తెలంగాణ వామపక్ష నాయకులు గద్దర్‌తో, పవన్‌తో చర్చలు జరుపుతామంటూ సంకేతాలిస్తున్నారు. ఇక తాజాగా టిడిపి నేత రేవంత్‌రెడ్డి మరో నర్మగర్భ వ్యాఖ్య చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకంగా చేసి తమ మద్దతు ఇస్తామని చెప్పాడు. దీంతో మరోసారి గద్దర్‌, వామపక్ష, జనసేనలకు టిడిపి కూడా సపోర్ట్‌ చేయడం ఖాయమంటున్నారు. తెలంగాణలో టిడిపి పవన్‌తో సహా వామపక్ష, గద్దర్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందంటున్నారు. గతంలో టిడిపి పలుసార్లు వామపక్షాలతో స్నేహం చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. మరి టిడిపి పవన్‌కి తెలంగాణలో సపోర్ట్‌ చేసినా కూడా అది పవన్‌కి మరింత చిక్కుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ