Advertisementt

'ఇంజినీర్ బాబు' లుక్ అదుర్స్!!

Tue 11th Apr 2017 04:20 PM
pawan kalyan,engineer babu,pawan new movie title engineer babu,director trivikram srinivas,class look  'ఇంజినీర్ బాబు' లుక్ అదుర్స్!!
'ఇంజినీర్ బాబు' లుక్ అదుర్స్!!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్టు ప్లాపులతో పని లేకుండా వరసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. అందులోనూ 2019 ఎన్నికల నాటికి ఎలాగైనా వీలున్నన్ని సినిమాలు చెయ్యాలని భావిస్తున్న పవన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ డైరెక్షన్ లో మొదలు పెట్టేసాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.

ఇక ఆ ప్రచారం ఏమోగానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'ఇంజినీర్ బాబు' అంటూ ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినషన్లో తెరకెక్కే చిత్రం టైటిల్ 'ఇంజినీర్ బాబు' అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక మూవీ మేకర్స్ కూడా ఇదే టైటిల్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు వార్తలొస్తున్నాయి. 'ఇంజినీర్ బాబు' టైటిల్ కి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి తీసుకుని ఒక పోస్టర్ ని తయారు చేసి పడేసారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందులో పవన్ కళ్యాణ్  ఇంజినీర్ లుక్ లో వావ్ అనిపించేమాదిరి కనబడుతున్నాడు.

టైటిల్ కి తగ్గట్టు పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇప్పుడా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ జంటగా నటిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ