Advertisementt

ఈసారి యాక్షన్ లుక్ లో దర్శనమిస్తుందట!!

Tue 11th Apr 2017 04:18 PM
shruthi haasan,action look,sanghamitra movie,sundar c director,arya,jayam ravi,shruti horse riding  ఈసారి యాక్షన్ లుక్ లో దర్శనమిస్తుందట!!
ఈసారి యాక్షన్ లుక్ లో దర్శనమిస్తుందట!!
Advertisement
Ads by CJ

ఎప్పుడూ గ్లామర్ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటిస్తూ మెప్పిస్తున్న శృతి హాసన్ ఇప్పుడు యాక్షన్ లుక్ లో దర్శనమివ్వబోతుందంట. గ్లామర్ తో ఆకట్టుకునే శృతి హాసన్ కత్తి పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహిచుకోండి. 'కాటమరాయుడు' చిత్రం తర్వాత శృతి హాసన్ తన తదుపరి చిత్రాన్ని సుందర్ సి దర్శకత్వంలో చేస్తుంది. సుందర్ సి తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్న 'సంఘమిత్ర' చిత్రం కోసం శృతి హాసన్ యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటుందట. దానిలో భాగంగానే కత్తి పట్టడం దగ్గరనుండి... గుర్రపు స్వారీ దాకా అన్నింటిలో శిక్షణ తీసుకుంటుందట.

ఆర్య, జయం రవి హీరోలుగా దర్శకుడు సుందర్ .సి ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక భిన్నమైన పాత్రలో కనిపిస్తుందని..... వీరోచిత వనితగా నటిస్తుందని అంటున్నారు. ఇదివరకెన్నడూ శృతి హాసన్ ఇలాంటి పాత్రలు చేసింది లేదు. అందుకే ఇప్పుడు 'సంఘమిత్ర' చిత్రం కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటుందట. మరి ఎప్పుడూ తన అంద చందాలతో మత్తెకించే శృతి ఇప్పుడు వీర వనితగా ఎలాంటి మెప్పు పొందుతుందో చూద్దాం..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ