ప్రస్తుతం మెగాఫ్యామిలీ మీద.. పవన్ మీద తోక తొక్కిన పాములా ఉన్నాడు వర్మ. ఆయన పవన్‌ని వదలడం లేదు. ఒకటి రెండు రోజులు గ్యాపిచ్చినా.. అది కేవలం చిన్న విరామం మాత్రమే అనేలా ఉంది ఆయన స్థితి. ఇక తాజాగా వర్మ మరోసారి పవన్‌ని టార్గెట్ చేశాడు. అది కూడా పవన్ విపరీతంగా అభిమానించే చెగువేరాను అడ్దుపెట్టుకుని.. ఆయన ట్వీట్ చేస్తూ.... పవన్ ట్వీట్లను చూస్తే చెగువేరా సమాధిలోనే తన్మయత్వంతోనే తెగ సంబరపడిపోవాల్సిందే. పవన్‌లోని అసాధారణమైన అర్దం చేసుకునే తత్వాన్ని చూసి ఆనందపడాల్సిందే. పవన్ కళ్యాణ్ వల్ల చెగువేరా ఆత్మ సమాధిలో ఎప్పటికీ శాంతిగా ఉండలేదు. దట్స్‌గ్రేట్... ఎందుకంటే.. శాంతిని వదిలేసి చెగువేరా, పవన్‌లు ఇద్దరు చెలరేగిపోయారు... అంటూ సెటైరిక్‌గా పవన్‌ని దెప్పిపొడిచాడు. తాజాగా పవన్ చేసిన దక్షిణాది, ఉత్తరాదికి గల తేడాలకు సంబంధించిన పవన్ దాదాపుగా దక్షిణ భారతదేశంకి అనుకూలంగా చేసిన ట్వీట్లు, దేశ విభజనను సమర్ధిస్తున్నట్లుగా ఉన్నాయనే విమర్శలు వస్తున్న సమయంలో వర్మ దానిని గురించే ఈ ట్వీట్స్ చేసినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు.