Advertisementt

తిక్క తిక్కగా సాగిన అవార్డులు...!

Tue 11th Apr 2017 01:03 PM
tsr tv9 awards,t subbarami reddy,vizag police,suma  తిక్క తిక్కగా సాగిన అవార్డులు...!
తిక్క తిక్కగా సాగిన అవార్డులు...!
Advertisement

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ వేత్త, కలియుగ దైవం టి.సుబ్బరామిరెడ్డి తన పేరుతో అవార్డులను ఇస్తున్నాడు. ఇందులో తప్పేమి లేదు. కానీ వీటిని కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి ఇస్తున్నాడా? మరి వెలుగులో లేని వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ఆల్‌రెడీ అగ్ర సింహాసనంపై ఉన్న వారికే ఎందుకు ఇస్తున్నాడు? ఈ డబ్బును పేద కళాకారులు, వృద్ద కళాకారుల కోసం వాడవచ్చుకదా...! ఈ అవార్డులను తన ఖ్యాతిని, పలుకుబడిని చూపించడానికి ఇస్తున్నాడా? అనే విమర్శలొస్తున్నాయి. 

ఇక ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వారిని కూడా పిలిచి తన సత్తా చాటుకుని తాజాగా వైజాగ్‌లో అవార్డుల వేడుక జరిపాడు. దీన్నిచూసిన వారు ఎంత చెత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? మహామహుల పరువు తీయడానికే ఇలా చేస్తున్నాడా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకకు యాంకర్‌గా వ్యవహరించిన సుమ నుంచి మధ్య మధ్యలో రెడ్డిగారు మైక్‌ లాక్కుని.. రా.. నువ్వు వేదికపైకి వచ్చి అవార్డు తీసుకొందువు..రా.. అని పిలవడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. ఇక ఈ కార్యక్రమానికి రాత్రి 10గంటల వరకు మాత్రమే వైజాగ్‌ పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ రాత్రి 10.30 దాటినా ఈ కార్యక్రమాన్ని ముగించలేదు. దీంతో ఓ పోలీస్‌ అధికారి జోక్యం చేసుకుని, ఇప్పటికే 10.40 అయింది. 10 వరకు మాత్రమే పర్మిషన్‌ ఉంది అని వేదికపైకి ఎక్కి మైకుద్వారా తెలిపాడు. అప్పుడు మన్నార్‌చోప్రా డ్యాన్స్‌ చేస్తూ ఉంది. 

కానీ సుబ్బరామిరెడ్డి మాత్రం ఆ తర్వాత కూడా మరో పాటను మొదలుపెట్టించి 'చెయ్‌..చెయ్‌.. కమాన్‌..స్టార్ట్‌.. చెయ్యవయ్యా.. చెయ్‌... కమాన్‌ స్టార్ట్‌' అంటూ మాట్లాడాడు. దీంతో పోలీసులు పాపం సగం చచ్చిపోయారు. కానీ వెంటనే టిఎస్‌ఆర్‌ సర్దుకుని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీసులు ఎంతో సహకరించారు.. అన్నారు. అందరికి అవార్డులు ఇవ్వకుండానే అర్థాంతరంగా ముగించారు. ఇదంతా ఓవర్‌యాక్షన్‌ వల్లే జరిగిందని, అవార్డులు పూర్తిగా అందుకోలేకపోయిన వారు నొచ్చుకున్నారు. ఇదండీ ఈ ప్రోగ్రాం తీరు.. సెహభాష్‌ టి.ఎస్‌.ఆర్‌....! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement