Advertisementt

చరణ్ కోసం చిరు అంత మోసం చేశాడా..?

Tue 11th Apr 2017 12:58 PM
ram charan,govindhudu andari vaadele movie,raj kiran,bandla ganesh,chiranjeevi,prakash raj  చరణ్ కోసం చిరు అంత మోసం చేశాడా..?
చరణ్ కోసం చిరు అంత మోసం చేశాడా..?
Advertisement
Ads by CJ

ఎప్పుడో జరిగిపోయిన విషయానికి ఇప్పుడు తమిళ సీనియర్  నటుడు రాజ్ కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది ఎవరిమీదో కాదు టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ స్టార్ అయిన చిరంజీవి మీద ఆయన కొడుకు రామ్ చరణ్ మీద. అప్పుడెప్పుడో రామ్ చరణ్ - కృష్ణ వంశి కాంబినేషన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే చిత్రం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ.. చిరంజీవి, రామ్ చరణ్ తనని గోవిందుడు అందరివాడేలే చిత్రం అప్పుడు మోసం చేశారని అంటున్నాడు రాజ్ కిరణ్.

ఆ సినిమా మొదలైనప్పుడు రామ్ చరణ్ కి తాతయ్య గా రాజ్ కిరణ్ ని సెలెక్ట్ చేసి కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశాడు కృష్ణవంశీ. అయితే ఆ కొద్ది రోజులు జరిగిన షూటింగ్ రషెస్ ని చిరంజీవి చూడగా అందులో  రాజ్ కిరణ్  చేసిన యాక్టింగ్ రామ్ చరణ్ చేసిన నటనను డామినేట్ చేసే విధంగా ఉండడంతో చిరు, కృష్ణ వంశీ ని పిలిచి అతన్ని తప్పించి అతని స్థానంలోకి ప్రకాష్ రాజ్ ని తీసుకోమని చెప్పగా కృష్ణ వంశీ అలానే చేసాడట. ఇప్పుడు అదే విషయాన్ని రాజ్ కిరణ్ చెబుతున్నాడు.

అలాగే తనని షూటింగ్ నుండి తప్పించినట్లు కనీసం ఇన్ఫామ్ కూడా చెయ్యలేదని.. అది తెలియని నేను ఇంకా షూటింగ్ కోసం పిలుస్తారని ఎదురు చూశానని చెబుతున్నాడు. అలాగే నిర్మాత బండ్ల గణేష్ కూడా తనకి ఇవ్వాల్సిన 10 లక్షల రెమ్యునరేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడు. మరి సినిమా ఇండస్ట్రీలో పెద్దమనిషిగా చలామణి అవుతున్న చిరు ఇలా చేసాడంటే ఎవరూ నమ్మలేకపొతున్నారు. మరి ఇన్ని ఆరోపణలు చేసిన రాజ్ కిరణ్ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ