ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ. దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ అని సాహిత్యంలో ఓ వాడుక వాక్యం ఉంది. ప్రపంచంలోని బాధ అంతా శ్రీశ్రీ తన కవితలో ఆవిష్కరిస్తాడు. కానీ తన బాధనే ప్రపంచం బాధగా దేవులపల్లి భావిస్తాడు. ఇక విషయానికి వస్తే ఆమద్య రాంగోపాల్ వర్మలాగా పలువురు ట్వీట్స్‌తో సంచలనం సృషిస్తూ, వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు. ఇదే కోవకు పలువురు చెందుతున్నా కూడా మనం ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి చెప్పుకోవాలి.
పవన్‌కళ్యాణ్‌కి చెందిన ఏ విషయమైనా ఇండస్ట్రీలో హట్‌టాపిక్‌గా మారి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. పవన్ తన వ్యక్తిగత విషయాలను ఎవ్వరికీ పబ్లిగ్గా చెప్పడు. కానీ వాటిపై అందరికీ ఆసక్తి ఎక్కువే. పవన్.. రేణుదేశాయ్ గురించి పెద్దగా మాట్లాడకపోయినా కూడా రేణు ట్విట్టర్‌ను, ఫేస్‌బుక్ వంటి వాటిని పలువురు ఫాలో అవుతూనే ఉంటారు. పవన్ ఆమె గురించి ఎప్పుడూమాట్లాడకపోయినా కూడా రేణు మాత్రం తరచుగా పవన్ గురించి ప్రస్తావన తెస్తూనే ఉంటుంది. ఇటీవల ఆమె తమ కుమారుడు అకీరానందన్ 13వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ మూడు నాలుగురోజులవుతున్నా కూడా ఇంకా సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది.
తన కుమారుడిని జూనియర్ పవర్‌స్టార్‌లా కానివ్వనని ఆమె తెలిపింది. ఆమె తల్లి కాబట్టి అందులో తప్పులేదు. కానీ పవన్ నేడు ఓ సినిమా నటుడే కాదు.. ఓ రాజకీయపార్టీకి వ్యవస్థాపకుడు కూడా. మరి ఆమె ఎందుకు అలాచెప్పింది? ఆమె బాధ ఏమిటి? అనేది తెలుసుకోవాలని ఎందరో ఎదురుచూస్తున్నారు. దానిని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని ప్రత్యర్ధులు భావిస్తున్నారు. కాబట్టి ఆమె ఏమనుకుంటుందో తెలియజేస్తే దానిలో తప్పేమీ లేదు.