Advertisementt

'డీజే' ఆలస్యం అయ్యేలా వుంది..!

Mon 10th Apr 2017 08:12 PM
dj duvvada jagannadham,allu arjun,harish shankar,dil raju,dj movie  'డీజే' ఆలస్యం అయ్యేలా వుంది..!
'డీజే' ఆలస్యం అయ్యేలా వుంది..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'డీజే.. దువ్వాడ జగన్నాథం' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి గెటప్ లో ఇరగదీసేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో దుమ్ముదులుపుతున్న అల్లు అర్జున్ తాజాగా విడుదల చేసిన బ్రాహ్మణుడి యాక్షన్ లుక్ కూడా అంతే ఆదరణ పొందుతుంది. ఈ లుక్ లో అల్లు అర్జున్ మంత్రాలూ వల్లిస్తూ విలన్స్ ని చితక్కొడుతుంటే అబ్బో పంతుళ్ళలో కూడా పవర్ ఫుల్ పంతుళ్లు ఉంటారనే భావన కలుగుతుంది.

ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఎలాగైనా ఈ చిత్రాన్ని మే కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి మే చివరి వారంలో సినిమా విడుదల చేయాలని భావించారు సదరు నిర్మాత దిల్ రాజు. కానీ కొన్ని కారణాల వల్ల డీజే చిత్రం మే లో విడుదల కాకపోవచ్చని... ఈ విడుదల తేదీ కూడా జూలై కి పోస్ట్ పోన్ అయినట్లు ప్రచారం మొదలైంది. అయితే దీనికి కారణం మాత్రం షూటింగ్ లో జరిగిన జాప్యమే అని చెబుతున్నారు. అయితే ఆ మధ్యన బన్నీ ఆరోగ్యం బాగోలేదని అందుకే డీజే షూటింగ్ ఆలస్యమవుతుందని ప్రచారం జరిగింది.

కానీ డీజే చిత్రం షూటింగ్ ఆలస్యానికి బన్నీ ఆరోగ్యం కారణం కాదని కేవలం షూటింగ్ జాప్యం వల్లనే ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్  చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జూన్ మొదటి వారానికి షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్పీడుగా కానిచ్చేసి  జూలై మొదటి వారంలో డీజే ని విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ