Advertisementt

తమ్ముడి కోసం అన్నయ్య త్యాగం..!

Mon 10th Apr 2017 07:21 PM
kalyan ram,jr ntr,jai lava kusa movie,director bobby,sai dharam tej  తమ్ముడి కోసం అన్నయ్య త్యాగం..!
తమ్ముడి కోసం అన్నయ్య త్యాగం..!
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా పరిచయమై 12ఏళ్లు కావస్తోంది. ఈ క్రమంలో ఆయన తానే హీరోగా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, తానే హీరోగా నటించాడు. వాటిలో 'అతనొక్కడే, పటాస్‌'వంటివి ఆయనకు విజయాలను అందించాయి. కాగా ఆయన నిర్మాతగా ఉండి రవితేజ-సురేందర్‌రెడ్డిల దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో 'కిక్‌2' చిత్రం చేశాడు. దాంతో ఆయనకు తీవ్రంగా నష్టాలొచ్చాయి. సమాయానికి తమ్ముడు ఎన్టీఆర్‌ ఆర్ధికంగా ఆదుకున్నాడు. 

ఆ చిత్రం షూటింగ్‌ సమయంలో నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల సినిమా గాడి తప్పడమే కాదు.. సరిగా రూపొందలేదు. ఇక రీషూట్‌లకు, ఇతర నిర్మాణ వ్యయాలు కూడా భారీగా పెరిగాయి. దాంతో రిలీజ్‌ సమయంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కళ్యాణ్‌రామ్‌ ప్రస్తుతం తన తమ్ముడు ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న 'జై లవ కుశ' నిర్మాణ పనులను తానే దగ్గరుండి చూసుకుంటున్నాడట. 

భారీ బడ్జెట్‌తో పాటు ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ చిత్రం పూర్తయి, రిలీజ్‌ అయ్యేవరకు తాను హీరోగా మరో సినిమా చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడట. కాగా గతంలో కళ్యాణ్‌రామ్‌ ఏ.యస్‌.రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తాడని, మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో కలిసి ఓ చిత్రం చేస్తాడని.. ఇలా పలు వార్తలు వచ్చాయి. కానీ 'ఇజం' వచ్చి ఇంతకాలమైనా కల్యాణ్‌రామ్‌ ఈసారి జోడెద్దుల సవారీ వద్దనుకుంటున్నాడు. సో.. ఆయన నటించే చిత్రానికి బాగా గ్యాప్‌ రానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ