Advertisementt

ఈ లుక్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు..!

Mon 10th Apr 2017 04:46 PM
ram charan,director sukumar,ram charan sukumar combination movie  ఈ లుక్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు..!
ఈ లుక్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కే పల్లెటూరి ప్రేమ కథా చిత్రం సెట్స్ మీదకెళ్ళిపోయి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత నటించనుంది. ఇప్పటికే సమంత కూడా ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్నాడని మొదటినుండి ప్రచారం జరిగినట్లుగానే రామ్ చరణ్ గెడ్డం పెంచేసి పల్లెటూరి లుక్ లోకి మారిపోయాడు. 

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లొకేషన్ నుండి ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు చరణ్. ఆ ఫొటోలో రామ్ చరణ్ అచ్చమైన పల్లెటూరి గెటప్ లో గెడ్డం పెంచిన యువకుడి మాదిరిగా లుంగీ, బనీన్ తో  కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో రామ్ చరణ్ ఇది వరకెన్నడూ ట్రై చెయ్యని కొత్త పాత్రని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఒక్క లుక్ తోనే ఇలా అభిమానులను పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ తన సినిమా ఫస్ట్ లుక్ తో ఇంకెంతటి సంతోషాన్ని అభిమానులకు పంచుతాడో చూద్దాం.

ఇంకా ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యమైన రోల్స్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ