Advertisementt

హీరోయిన్ స్వాతి.. భేష్‌..!

Mon 10th Apr 2017 04:37 PM
heroine swathi,telugu film industry,tripura movie,tamila,malayalam  హీరోయిన్ స్వాతి.. భేష్‌..!
హీరోయిన్ స్వాతి.. భేష్‌..!
Advertisement
Ads by CJ

తన చిన్నతనంలోనే తన టాలెంట్‌లో కలర్స్‌ స్వాతిగా పేరుతెచ్చుకున్న చిన్నది స్వాతి. తెలుగు పరిశ్రమ ఆమెను గుర్తించకపోయినా తమిళ, మలయాళ పరిశ్రమలు ఆమెను ప్రోత్సహించాయి. ఎన్నో అవార్డు విన్నింగ్‌ చిత్రాలలో ఆమె తన నటనా టాలెంట్‌ను చూపించింది. ఇక తెలుగులో ఆమెకు వచ్చిన అవకాశాలను వేళ్లపై లెక్కబెట్టవచ్చు. ఆమె చివరగా నటించిన చిత్రం 'త్రిపుర'. కాగా ఆమెకు తాజాగా ఓ పెద్ద నిర్మాణ సంస్దలో పెద్ద చాన్స్‌ వచ్చినా ఆమె తిరస్కరించిందని సమాచారం.

వారు మంచి రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినా, ఆ చిత్రంలో నటిస్తే హీరోయిన్‌గా తెలుగులో కూడా తన స్టార్‌స్టేటస్‌ వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ఆమె ఆ చిత్రంలో హాట్‌హాట్‌ సీన్స్‌, ఎక్స్‌పోజింగ్‌ చేయాల్సివుండటంతో నో చెప్పిందట. తమిళ, మలయాళ చిత్రాలలో మంచి మంచి నటనకు స్కోప్‌ ఉన్న అవకాశాలు వస్తున్న సమయంలో తన క్లీన్‌ ఇమేజ్‌ను తాను బిజీ కావడానికి, తన రెమ్యూనరేషన్‌ పెరుగుతుందన్న వాటిని కూడా ఆమె తోసిరాజని ఆ చిత్రానికి నో చెప్పిందని తెలుస్తోంది. హ్యాట్సాఫ్‌ స్వాతి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ