Advertisementt

సింగర్ ప్రణవి బాధ ఇది..!

Mon 10th Apr 2017 03:40 PM
singer pranavi,raghu master wife,singer remuneration issue  సింగర్ ప్రణవి బాధ ఇది..!
సింగర్ ప్రణవి బాధ ఇది..!
Advertisement
Ads by CJ

నందిఅవార్డులతో పాటు టాలెంట్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్న గాయని ప్రణవి. తాజాగా ఈమె షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ భార్య ఈమే. ఈమెకు భారీ నిర్మాణ సంస్థలు, నిర్మాతలు బ్లాక్‌మెయిల్‌ చేసి మరీ అతి చీప్‌గా పాడించుకునే వారట. దానికి కారణం కొందరు కొత్త సింగర్స్‌ ఫ్రీగా పాడటానికి కూడా సిద్దంగా ఉండటంతో 2వేలు. 3వేలు, గరిష్టంగా 5వేలు ఇచ్చేవారు అని తెలిపింది.

ఇక తాను పాడిన పాటలను తన గొంతునే పోలివుండే శ్రేయాఘోషల్‌ పాడినట్లుగా పబ్లిసిటీ ఇచ్చేవారట. అదే ఆమె టీవీసీరియల్స్‌. జింగిల్స్‌కు పాడితే 30వేలు ఇచ్చేవారని తెలిపింది. కానీ కొందరు మాత్రం తమ టాలెంట్‌ను గుర్తించేవారు అని తెలిపింది. చిన్నబడ్జెట్‌ చిత్రమైనప్పటికీ 'పెళ్లిచూపులు' నిర్మాత తనకు పాటకు 15వేలు ఇచ్చిన విషయాన్ని వెల్లడించింది. ఇక ఆమె భర్త రఘు మాస్టర్‌ మాట్లాడుతూ. ప్రణవి రెమ్యూనరేషన్‌ విని షాకయ్యాను, నా అసిస్టెంట్స్‌ కూడా ఆమె కంటే ఎక్కువ సంపాదిస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనికి ఓ విధంగా మన మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, నిర్మాతలు కలిసి ప్యాకేజీ సిస్టమ్‌ని తీసుకొని రావడమే అసలు కారణమనేది నిర్వివాదాంశం. ఒక్క షాట్‌ చేయడానికి 100టేకులు తినే టాలెంట్‌లేని సోకాల్డ్‌ ఆర్టిస్టులకు, హీరోయిన్లకు కోట్లకు కోట్లు ఇచ్చే నిర్మాతలు నిజమైన టాలెంట్‌ ఉన్న సింగర్స్‌ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం దారుణం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ