12వ తేదీన జరగనున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికలలో ప్రవాసాంద్రులు కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నియోజకవర్గంలోని ఓట్లలో 30 శాతం తెలుగువారి ఓట్లు ఉన్నాయి...సో.. ఈ ఎన్నికల్లో తెలుగు వారు ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ నియోజకవర్గంలోని తెలుగు ప్రజలు జయలలితకు మద్దతుగా నిలబడ్డారు. ఆమెకు మూకుమ్మడిగా ఓట్లు వేశారు. ఆమె ఆ నియోజకవర్గంలో తెలుగులోనే ప్రచారం చేసేది. దాంతో ఆమెను ప్రవాసాంద్రులు తమ వ్యక్తిగా జయను భావించారు.
కానీ ఈసారి మాత్రం పరిస్థితి ఎవరి ఊహకు అందకుండా సాగుతోంది. శశికళకు చెందిన దినకరన్ ఇప్పటికే అక్కడి తెలుగు నాయకులతో సమావేశమై తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. వారు నాలుగైదు డిమాండ్లను దినకరన్ ముందు ఉంచి. వాటికి మద్దతు ఇస్తే తాము ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జయ మేనకోడలు దీపాకి, పన్నీర్‌సెల్వం అభ్యర్థికి కూడా అక్కడ మంచి మద్దతే ఉంది.
ఇక అక్కడ ఓ ప్రవాసాంధ్రుడు కూడా పోటీ చేస్తున్నాడు. దీంతో పోటీ రంజుగా మారింది. ఇక దినకరన్, శశికళ, పళనిస్వామిలు విజయశాంతిని ప్రచారంలోకి దించుతున్నారు. అలాగే బిజెపి కూడా పురంధేశ్వరి చేత తమ అభ్యర్థి గంగై అమరన్‌కు ప్రచారం చేయిస్తోంది. మరి ప్రవాస తెలుగు వారు ఆర్కేనగర్‌లో ఎలాంటి తీర్పునిస్తారో వేచిచూడాల్సివుంది..!