Advertisementt

పంతులు కాదు..! పవర్ ఫుల్ పంతులు..!

Sun 09th Apr 2017 12:29 PM
dj movie,director harish shankar,allu arjun,devi sriprasad,pooja hegde  పంతులు కాదు..! పవర్ ఫుల్ పంతులు..!
పంతులు కాదు..! పవర్ ఫుల్ పంతులు..!
Advertisement
Ads by CJ

'డీజే' ఫస్ట్ లుక్ తో చాలా సాఫ్ట్ గా పంతులు గెటప్ లో దర్శనమిచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు బర్త్ డే సందర్భం గా వదిలిన పోస్టర్ లో మాత్రం చాలా పవర్ ఫుల్ పంతులు.. అంటే పంతులు మంత్రాలూ చదువుతూ ఫైటింగ్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూపించేసి చితక్కొట్టేశాడు. ఏదో బ్రాహ్మణ పాత్రలో అల్లు అర్జున్ చాలా క్లాస్ గా కామెడీగా కనపడుతున్నాడని  ఫస్ట్ లుక్ చూసి డిసైడ్ చేసేసారు. అయితే ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెబుతూ 'డీజే'  డైరెక్టర్ హరీష్ శంకర్ చిన్న సర్‌ప్రైజ్‌.. మిడ్ నైట్  వరకూ వేచి చూడండి.. అంటూ ట్వీట్ చేసాడు.

ఇక హరీష్ ట్వీట్ చూసినప్పటినుండి హరీష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎలాంటి సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసాడో అని తెగ ఆతృతగా ఎదురు చూశారు. ఆ ఆత్రుతని పటా పంచలు చేస్తూ మళ్లీ బ్రాహ్మణ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ డీజే పోస్టర్ ని విడుదల చేసాడు. ఆ లుక్ లో అల్లు అర్జున్ మంత్రాలూ వల్లిస్తూ యాక్షన్ సన్నివేశంలో కుమ్మేస్తున్నాడు. బ్రాహ్మణుడు కూడా ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో అని చూపించేసాడు హరీష్ శంకర్. ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వదిలిన 'డీజే' పోస్టర్ కి విపరీతమైన ఆదరణ వచ్చేసింది.

మరి ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ తోనే ఆసక్తి రేకెత్తించిన 'డీజే' ఇప్పుడు ఈ లుక్ తో ఎన్నో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ