Advertisementt

శ్రియా.. కి మళ్లీ ఎంగేజ్మెంట్ అయ్యిందా..?

Sun 09th Apr 2017 12:17 PM
akkineni nagarjuna,akhil,shriya bhupal,gvk family,nri family,shriya bhuapal engagement  శ్రియా.. కి మళ్లీ ఎంగేజ్మెంట్ అయ్యిందా..?
శ్రియా.. కి మళ్లీ ఎంగేజ్మెంట్ అయ్యిందా..?
Advertisement
Ads by CJ

అక్కినేని ఇంటికి కోడలిగా రావాల్సిన జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ ఇప్పుడు మరొకరి ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతుంది . అఖిల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న శ్రియా భూపాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కుతుంది అనుకున్న టైమ్ లో కొన్ని కారణాల వల్ల అఖిల్ - శ్రియా భూపాల్ ఇద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఈ పెళ్లి రద్దయిన తర్వాత అఖిల్ కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్లీ తన పనుల్లో బిజీ అయిపోయి తన రెండవ సినిమాని ప్రారంభించేశాడు. 

ఇక ఇప్పుడు శ్రియా భూపాల్ కూడా అఖిల్ తో బ్రేకప్ అయ్యాక మరో ఎన్నారై కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసుకుందని చెబుతున్నారు. రెండ్రోజుల క్రితమే చాలా సింపుల్ గా శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రచారం మొదలైంది. ఈ ఎంగేజ్మెంట్ కు అటు శ్రియా భూపాల్ ఫ్యామిలీతో పాటు ఎన్నారై పెళ్ళికొడుకు ఫ్యామిలీ మాత్రమే హాజరైనట్టు చెబుతున్నారు. అసలు అక్కినేని అఖిల్ తో పెళ్లి ఎందుకు రద్దయిందనే విషయాన్ని మాత్రం జివికె ఫ్యామిలీ ఇప్పటివరకు బయట పెట్టలేదుగాని ఇప్పుడు శ్రియా భూపాల్ కు మాత్రం వెంటనే ఎన్నారై పెళ్లి కొడుకుని చూసేసి సైలెంట్ గా పెళ్లి పనులు కానిచ్చేస్తున్నారు.

కానీ ఇక్కడ అఖిల్ మాత్రం తన కెరీర్ ని చక్కదిద్దుకునే పనుల్లో తెగ బిజీ అయ్యాడు. అయితే అఖిల్ కి మాత్రం ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదని అఖిల్ సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ