మహేష్ బాబు వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 'బ్రహ్మ్మోత్సవం' డిజాస్టర్ తర్వాత ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా చేసున్న మహేష్ ఈ చిత్రం కంప్లీట్ కాగానే కొరటాల శివతో మరో మూవీ కి కమిట్ అయ్యాడు. కొరటాల చిత్రం పూర్తవ్వగానే వంశి పైడిపల్లి డైరెక్టన్ లో మరో మూవీ కి సైన్ చేశాడు మహేష్. మురుగదాస్ తో చేస్తున్న చిత్రం మే వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుని జూన్ లో సినిమా విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరవాత కొరటాలతో 'భరత్ అను నేను' చిత్రాన్ని పట్టాలెక్కించెయ్యడానికి మహేష్ రెడీగా వున్నాడు.
ఇక ఆ తర్వాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మహేష్ మరో హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంటాడని ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కామెడీకిపెట్టింది పేరైన అల్లరి నరేష్ ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం మహేష్ - వంశీ చిత్రానికి ఎంపిక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వంశీ పైడిపల్లి రాసుకున్న కథలో ఒక కీలకమైన పాత్రకి అల్లరి నరేష్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని భావించి మహేష్ తో వంశీ చర్చలు జరిపి ఒకే చేయించుకున్నట్లు కథనాలు ప్రచారం అవుతున్నాయి.
ఇక అల్లరి నరేష్ ని కూడా వంశీ పైడిపల్లి సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే వంశీ - మహేష్ చిత్రం మొదలుపెట్టడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది చెప్పడం కొంచెం కష్టమే.