అమీర్‌ఖాన్ ఏ చిత్రం చేసిన దానిలో అన్యాపదేశంగా మంచి సందేశమో లేక దేశభక్తో ఉంటుంది. చాలా కొద్దికాలం కిందట ఇండియాలోని అసహనంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య విదేశాలకు వెళ్లిపోదామని బలవంతం చేస్తోందని తెలిపాడు. దాంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అమీర్‌కి ఇష్టంలేకపోతే బలవంతంగా ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యలు వినిపించాయి. ఆతర్వాత ఆయన నటించిన ఒకటి రెండుచిత్రాలపై ఆ ప్రభావం కూడా పడింది. కానీ 'దంగల్'తో ఆయన మరోసారి తన సత్తా చూపించాడు.
దేశభక్తిని, ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదనే సందేశాన్ని ఇస్తూ ఈ చిత్రం చేశాడు. కాగా గతకొంతకాలంలో పాకిస్థాన్‌లో ఇండియన్ చిత్రాలపై నిషేధం ఉంది. కానీ దానిని తాజాగా ఎత్తివేశారు. దీంతో పాకిస్తాన్‌లో 'దంగల్'ని వెండితెరపై చూసేందుకు మార్గం సుగుమమైంది. కానీ పాకిస్థాన్ సెన్సార్‌బోర్డ్ మాత్రం ఈ చిత్రం చివరలో వచ్చే జాతీయ గీతాన్ని తొలగించాలని కోరింది. పాకిస్థాన్‌లో తన చిత్రానికి వచ్చే కోట్లు తనకు అవసరం లేదని, తాను జాతీయ గీతాన్ని తొలగించే ప్రసక్తే లేదని అమీర్ తేల్చిచెప్పి, దేశం కోసం తనకు కోట్లు ముఖ్యంకాదని నిరూపించాడు. హ్యాట్సాఫ్.. అమీర్....!