చిరంజీవి తన 151వ చిత్రంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బయోపిక్‌ని చేయనున్నాడు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన గతంలోనే 'రాజన్న, అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి, ఓం నమో వేంకటేశాయ' చిత్రాలు చేశాడు. బాలకృష్ణ ఇటీవలే 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేశాడు. త్వరలో తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని చేయనున్నాడు. ఇక వైవిధ్యంలో ఎప్పుడు ముందుండే వెంకీ త్వరలో తెలుగు సాహితీప్రియులకు చిరపరిచితమై హెచ్‌ఎంరెడ్డి దర్శకత్వంలో మొదటి తెలుగు హాస్యనవలా ఆధారితంగా రూపొందిన 'బారిష్టర్ పార్వతీశం' చేయనున్నాడని సమాచరం. ఈ నవలలోని మొదటి భాగం చాలామందికి చిరపరిచితమే కావడం విశేషం. ఇది తెలుగు అకాడమీ వారి తెలుగు ఉపవాచకంలో ప్రచురించబడిన నవల. సో.. ఇది కూడా తెరకెక్కితే ఇక మన తెలుగుసీనియర్ స్టార్స్ అందరూ మారారని గర్వంగా చెప్పుకోవచ్చు.