Advertisementt

చిరు, బ్రహ్మీ.. వీరు పెద్దమనుషులా...?

Sat 08th Apr 2017 05:35 PM
  చిరు, బ్రహ్మీ.. వీరు పెద్దమనుషులా...?
చిరు, బ్రహ్మీ.. వీరు పెద్దమనుషులా...?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి రాజ్యసభకు అంటే పెద్దల సభకు వెళ్లి ఉండవచ్చు. ఆయన మెగాస్టార్‌ అయి ఉండవచ్చు. ఇక బ్రహ్మానందం గురించి, ఆయన చేష్టలు గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. చిరంజీవిని కెరీర్‌ మొదటి నుంచి గమనిస్తున్న వారు, బ్రహ్మా జీవితాన్ని దగ్గరగా చూసిన వారు ఎందరో ఉన్నారు. కాగా వీరిద్దరు ఇటీవల ఓ పెద్ద తప్పు చేశారు. అది సరిదిద్దుకోలేనిది.

చిరు హోస్ట్‌గా పనిచేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడుకి బ్రహ్మానందం గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక చిరు పనిచేసిన ఎన్నో చిత్రాలకు ముఖ్యంగా ఆయనకు ఎవర్‌గ్రీన్‌ హిట్‌గా నిలిచిన 'జగదేక వీరుడు-అతిలోక సుందరి' చిత్రానికి సంభాషణలతో పాటు, ఆయనలోని కామెడీ కోణాన్ని ఆవిష్కరిస్తూ స్వర్గీయ జంధ్యాల 'చంటబ్బాయ్‌'వంటి చిత్రం తీశాడు.ఇక బ్రహ్మీకి 'అహనా పెళ్లంట' ద్వారా అరగుండు బ్రహ్మానందంగా బ్రేక్‌నిచ్చారు. ఆ మహానుభాహుడు ఇప్పుడు మనమధ్య లేరు.

కానీ ఆయన తీసిన ఎన్నో ఆణిముత్యాలు ఇప్పటికి మనకు గుర్తుంటాయి. చిరు, బ్రహ్మీలిద్దరు 'ఎంఈకే'లో జంధ్యాల తాగుడు వల్ల చనిపోయాడని, గతంలో రాజబాబు కూడా అదే విధంగా మరణించాడని ఐదు నిమిషాల సేపు అదే మాటలను మాట్లాడారు. దీనిపై జంధ్యాల సతీమణితో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు కూడా చిరు, బ్రహ్మీలకు లీగల్‌నోటీసులు ఇవ్వాలని భావించారు. కానీ కొందరు వారించడంతో కేవలం ఫోన్‌లో వారిద్దరిని మందలించారు. ఈ విషయంలో మన సినీ పెద్దలు చిరు, బ్రహ్మీలను బాగానే కవర్‌చేశారు.

ఇక చిరు తన ప్రజారాజ్యం పార్టీ మొదటి సభ తిరుపతిలో మాట్లాడినప్పుడు ఆయన ఏ బ్రాండ్‌ మద్యం తాగాడో చెప్పమంటారా? బ్రహ్మీ అసలు స్వరూపం ఏమిటో వివరించమంటారా? వీరు పెద్ద మనుషులా...కాదు..కాదు.. చీడపురుగులు...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ