పార్లమెంట్‌లో స్వయాన పౌరవిమాన యాన శాఖా మంత్రి అశోక్‌గజపతి రాజును శివసేన ఎంపీలు కొట్టినంత పనిచేశారు. స్వతహాగా అశోక్‌గజపతి రాజును పార్టీలకతీతంగా అందరూ అభిమానిస్తారు. మృదుస్వభావి, వివాదరహితుడు. కానీ ఆయనపై దాడిజరిగితేనే బిజెపి మంత్రులు, ప్రధాని ఏమీ చేయలేకపోయారు. ఇక మన నాయకులు పార్లమెంట్, అసెంబ్లీలలోనే కాదు.. బయట కూడా చాలా చీప్‌గా మాట్లాడుతూ అందరిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
ఎమ్మెల్యే రోజా చినబాబు లోకేష్‌ను, మంత్రి అయ్యన్నపాత్రలను ఉద్దేశించి సుద్దపప్పు, ముద్దపప్పు, ఎర్రిపప్పు అంటూ నీచంగా మాట్లాడింది. ఇది ఆమెకి కొత్తేమీ కాదు. ఓసారి ఆమె ఓ బహిరంగ ప్రెస్‌మీట్‌లో (అప్పుడు ఆమె టిడిపిలో ఉంది) చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లను ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడింది. తాను నటిగా ఉన్నప్పుడు ఎందరితో పడుకున్నావని కొందరు ప్రశ్నిస్తున్నారని, మరి పవన్ తన భార్య (అప్పుడు) రేణూదేశాయ్‌ని చిరు. పవన్‌లు ఎందరి పక్కలో పండుకోబెట్టారని మాట్లాడింది. దాంతో అదే విలేకరుల సమావేశంలో ఉన్న సీనియర్లయిన సోమిరెడ్డి వంటి వారు తలలు దించుకున్నారు.
ఇక తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలపై మంత్రి పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రికార్డు డ్యాన్స్‌లలో ఎక్స్‌పోజింగ్ చేసే రోజా వంటి వారిని ఎమ్మెల్యేలను చేయడం మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించాడు. ఈ మాటల యుద్ధం ఇప్పటితో ముగిసేలా కనిపించడం లేదు. ఇలా బూతులు మాట్లాడితేనే మీడియా ఫైర్‌బ్రాండ్ అని బిరుదు ఇస్తోంది. మరి ఇలాంటి బిరుదులకు పొంగిపోయి ఆమె మరెంత ఫైర్‌బ్రాండ్‌గా మారుతుందో వేచిచూడాలి...!