యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ది ఓవర్ యాక్టింగ్ అని కొందరు అనుకుంటున్నారు. దీనిలో వాస్తవం ఉంది. కానీ ఓవర్‌ప్లే, అండర్‌ప్లే అనే విషయంలో ఎవరి భావాలు వారివి. ఆ ఓవర్ యాక్టింగే నిజమైన గుర్తింపును తెచ్చేది. ఎలా అంటే.. స్వర్గీయ ఎన్టీఆర్, శివాజీగణేషన్ నుంచి పోలీస్ పాత్రల్లో రాజశేఖర్ వరకు చివరకు తన కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన 'పోలీస్‌స్టోరీ' చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా సాయికుమార్ చేసింది ఓవర్‌యాక్టింగ్ కాదా? కానీ అవే ఆయా నటులకు పెద్ద విజయాలను అందించి, వారి నటనాప్రస్ధానంలోనే మైలురాళ్లుగా నిలిచి, ప్రేక్షకులను ఓ ఊపు ఊపాయి.
ఇక పాత చిత్రాలలో, మరీ ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో ఎన్టీఆర్ అనర్గళంగా పేజీల పేజీల డైలాగ్‌లను కూడా సింగిల్ టేక్‌లో ఓకే చేసేవాడు. ఆయన చెప్పే డైలాగులలో ఎక్కువగా సంస్కృతంలో ఉంటాయి. సామాన్య ప్రేక్షకులకు, ముఖ్యంగా పామరులు, మాస్, నేల, బెంచి ఆడియన్స్‌కి అర్ధం కావు. కానీ ధియేటర్లు చప్పట్లతో మారుమోగిపోయేవి. అందరూ సాహో అనేవారు. ఆయనకు ఉన్న అభిమానుల్లో పామరులు, సామాన్యులు, మాస్ ప్రేక్షకులే ఎక్కువ. కాబట్టి ఎవరి నటనను మనం తప్పుపట్టలేం. ఎవరి పంథా వారిది...!