తనకు తాను సన్మానాలు చేయించుకుంటూ.... పెద్దపెద్ద వాళ్లకు సన్మానాలు, అవార్డులు ఇస్తూ తనకు తాను కళాబంధుగా పిలుచుకునే డబ్బున్న వ్యక్తి, రాజకీయ వేత్త, పారిశ్రామికవేత్త, బడా కాంట్రాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి. ఈయన గతంలో ఒకసారి తాను చేసే శివపూజల వల్లనే దేశానికి, వైజాగ్‌కు మంచి జరుగుతోందని చెప్పాడు. ఇక వైజాగ్ ప్రజలను ఆకర్షించడానికి ఎన్నో జిమిక్కులు చేస్తున్నాడు. గతంలో నెల్లూరులో పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ సమయంలో తాను నెల్లూరుకు పెద్ద పెద్ద సినిమా వారిని తెస్తానని వాగ్దానం చేశాడు. సినిమా వాళ్లను తీసుకుని వచ్చినంత మాత్రాన వైజాగ్, నెల్లూరులోని సమస్యలన్నీ తీరిపోతాయా? తనకున్న డబ్బును మంచి పనులకు ఉపయోగించుకుంటే మంచిది.
సేవ చేసిన వాడు అవుతాడు. డబ్బును ఇలా దుర్వినియోగం చేయకూడదు. నా డబ్బు నా ఇష్టం.. అంటే సమాధానం చెప్పలేం. ఇక ఆయన నాగార్జునసాగర్ నుంచి ఎన్నో నాసిరకం కాంట్రాక్టుల్లో ప్రజల డబ్బునే దోచుకున్నాడు. కాబట్టి ఆయన్ను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ఆయన ప్రకటించిన టియస్‌ఆర్ అవార్డ్సులో అందరినీ మెప్పిస్తూ, అందరినీ కాకాపడుతూ, నొప్పింపక తానొవ్వక అనే సూత్రాన్ని ఆయన ఫాలో అయ్యాడు. కానీ నందులకు పందులకు తేడా తెలియని వారికి అవార్డులు ఇవ్వడం వల్ల అవార్డులంటేనే ఏహ్యభావం కలుగుతోంది...!