'జీన్స్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అల్లారించిన హీరో ప్రశాంత్ గుర్తుండేవుంటాడు. అయితే 'జీన్స్' తర్వాత అంతటి హిట్ అయిన సినిమాలో ప్రశాంత్ మరలా కనిపించలేదు. తమిళంలో కొద్దో గొప్పో సినిమాల్లో నటించే ప్రశాంత్ భార్య భాదితుడంట. ఆయన తన భార్య వల్ల చాలా కష్టాలు అనుభవించాడంట. అందుకే తన భార్య గృహలక్ష్మి నుండి విడాకులు తీసేసుకున్నానంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం కోలివుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
తన భార్య వల్ల తాను చాలా మానసిక వేదన అనుభవించానని.... గృహలక్ష్మి ని నేను పెళ్లి చేసుకునే ముందే ఆమెకి వేరేవారితోనో పెళ్లయిందని... ఆ విషయం దాచి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుందని... అంతేకాక ఆమె మొదటి భర్తతో ఇంకా వివేహేతర సంబంధం కొనసాగిస్తుందని.. అందుకే ఆమెతో కలిసి ఉండలేక చెన్నై ఫామిలీ కోర్టు నుండి విడాకులు తీసుకున్నానని చెప్పాడు.
అయితే తాను విడాకులైతే తీసుకున్నాను గాని తన కొడుకు సమస్య తీరకపోవడం కొంచెం భాదగా ఉందని చెబుతున్నాడు నటుడు ప్రశాంత్.