కోలీవుడ్‌లో మరో పవర్ స్టార్ వెలిశాడు. ఇతను సూపర్‌స్టార్ రజనీని కూడా మించిపోయాడు. అతనే సూర్య. ఈమధ్య సూర్యకి సరైన హిట్ లేదు. ప్రస్తుతం ఆయన తనే నిర్మాణ భాగస్వామిగా ఉండి, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో జ్ఞానవేల్‌రాజాకి చెందిన స్టూడియోగ్రీన్‌తో కలిసి చిత్రాలు చేస్తున్నాడు. కాగా వీరి కాంబినేషన్‌లో నిర్మితమైన '24' చిత్రం తెలుగులో బాగా ఆడి, ప్రశంసలు తెచ్చుకున్నా కూడా నిర్మాతగా సూర్యకు, జ్ఞానవేల్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. సో.. తమిళంలో ఆ చిత్రాన్ని ఎక్కువరేటుకు కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం తనతో రెండు బ్లాక్‌బస్టర్స్‌ని ఇచ్చిన హరిని దర్శకునిగా పెట్టుకుని, 'సింగం' సిరీస్ క్రేజ్‌తో 'ఎస్3' చిత్రం చేశాడు. సూర్య-హరిల క్రేజీ కాంబినేషన్‌ను చూసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కూడా భారీ రేట్లకు కొన్నారు. ఈ చిత్రం దాదాపు 100కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్ అయింది. సో.. తెలుగు వెర్షన్ హక్కులను 18కోట్లకు కొన్న మల్కాపురం శివకుమార్‌కి 11కోట్లు కూడా రికవరీ కాలేదు. దీంతో ఆయన బాగా నష్టపోయాడు.
ఇక ఈ చిత్రం తమిళంలో బాగానే ఆడినప్పటికీ మొత్తం మీద 60కోట్లు కూడా రాలేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 30కోట్ల వరకు నష్టం తేలింది. దీంతో ఈ చిత్రం కొన్న వారు లబోదిబో మంటున్నారు. అంటే తెలుగులో జ్ఞానవేల్‌రాజా స్థానంలో శరత్‌మరార్ ఉన్నాడు. సూర్య ప్లేస్‌లో పవన్ ఉన్నాడు.. జస్ట్ అంతే తేడా...! మరి '24, ఎస్3' రెండింటినీ కొని నష్టపోయిన వారికి. పవన్, డాలీకి అవకాశం ఇచ్చినట్లుగా సూర్య కూడా విఘ్నేష్‌శివన్ అనే పెద్దగా పేరులేని దర్శకునితో ప్రస్తుతం చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రాన్ని తన సినిమాలను కొన్ని నష్టపోయిన వారికే ఇస్తానంటున్నాడు. మరి ఇందులో కొన్నవారి తప్పు ఒప్పులను పక్కనపెడితే కోలీవుడ్‌లో మరో పవన్‌కళ్యాణ్‌గా సూర్య మారాడనే విమర్శలు ఎక్కువయ్యాయి.