Advertisementt

న్యాయస్థానాల తీరు ఇలా ఉంది...!

Fri 07th Apr 2017 04:09 PM
courts,uttar pradesh,uttar pradesh yogi adityanath,bjp  న్యాయస్థానాల తీరు ఇలా ఉంది...!
న్యాయస్థానాల తీరు ఇలా ఉంది...!
Advertisement

ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన చేస్తున్న పనులు, సాహసోపేతమైన నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలందుకొంటున్నాయి. ఆయన తమ మేనిఫెస్టోలోనే యూపీలో అధికారంలోకి వస్తే గోవధను నిషేదిస్తామని, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చాడు. ట్రిపుల్‌ తలాక్‌తో వీధినపడుతున్న ముస్లిం మహిళలకు అండగా ఉంటానన్నాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా యూపీలోని బురఖా వేసుకున్న మహిళలు ట్రిపుల్‌తలాక్‌ వంటి హేయమైన పద్దతుల వల్ల తమకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా మిగిలిన పార్టీలను కాదని బిజెపికి ఓటువేశారు. ఇక గోవధ కూడా అంతే. దేశంలోని మెజార్టీ ప్రజలు దీనికి మద్దతు పలికారు. 

మరి ఇవి న్యాయస్థానాలకు తప్పనిపిస్తే మేనిఫెస్టోలో బిజెపి వాటిని చేర్చినప్పుడే ఆ న్యాయస్థానాలు ఇది తప్పు అని చెప్పి ఉండి.. తీర్పునిచ్చి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడుమాత్రం కోర్టు జోక్యం చేసుకొని ఆహారపు అలవాట్లపై నిర్ణయం ప్రజల హక్కు అని, గోవులను తినడం తప్పేమీ కాదన్నట్లుగా చెబుతోంది. మరి ఆహారపు అలవాట్లు ప్రజల ప్రాధమిక హక్కు అయితే వన్యప్రాణులను, కృష్ణజింకలను, దుప్పులను, కుందేళ్లు, నెమలి వంటి వాటిని కూడా తినడం తప్పుకాదనే చెప్పాలి. మరి ముస్లింలు ఉన్న ఏరియాలోని హిందువులు, ఇతర మతస్తులు పందులను తింటే ముస్లింలు ఎందుకు వ్యతిరేకించి, దాడులు చేస్తున్నారో న్యాయస్థానాలే తేల్చాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement