Advertisementt

మంచి చిత్రాల దర్శకుడు, భారీ నిర్మాణ సంస్థ!!

Fri 07th Apr 2017 01:34 PM
chandra siddhartha,rockline venkatesh,aa naluguru,chandra siddhartha movies  మంచి చిత్రాల దర్శకుడు, భారీ నిర్మాణ సంస్థ!!
మంచి చిత్రాల దర్శకుడు, భారీ నిర్మాణ సంస్థ!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ దర్శకుల్లో కొందరు కమర్షియల్‌ మార్గం ఎంచుకుంటే మరికొందరు మాత్రం విలువలు పాటించడానికే ఇష్టపడతారు. దర్శకత్వం చేయడమే లక్ష్యం కాదు ఒక మంచి సినిమాను అందించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిలో చంద్రసిద్దార్థ ఒకరు. 'ఆ నలుగురు', 'ఇదీ సంగతి', 'అందరిబంధువయ్యా' వంటి చిత్రాలు ఆయన తీసినవే. బాక్సాఫీస్‌ విజయం దక్కనప్పటికీ, మానవతా కోణాన్ని తన చిత్రాల్లో ఆవిష్కరించాడని పేరు తెచ్చుకున్నాడు. 'ఏమో గుర్రం ఎగరావచ్చు' (2014) తర్వాత ఖాళీగా ఉన్న చంద్రసిద్ధార్థకు ఒక భారీ నిర్మాణ సంస్థ నుండి పిలువు వచ్చినట్టు తెలిసింది. 'రాక్‌లైన్‌' వెంకటేష్‌ తెలుగులో భారీ వ్యయంతో నిర్మించే చిత్రానికి చంద్రసిద్ధార్థ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ ఫైనలైజ్‌ అయింది. హీరో ఎంపిక జరిగింది. ఇదే నెల 22న సినిమా షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ