సినిమా వారిలో ఉండే బంధాలు, ఆప్యాయతలు బయటి వారికి పెద్దగా తెలియవు. జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణతో పాటు నాగార్జున వంటి వారిని కూడా బాబాయ్ అని సంభోదిస్తాడు. వారు తారక్ అని పిలుస్తారు. రాజమౌళిని జక్కన్న అని, వినాయక్‌ని చనువుగా వినయ్ అని పిలిచే వారు ఉంటారు. తాజాగా చిరంజీవి అభిమాని వరకు ఎస్పీబాలసుబ్రహ్మణ్యంని ఉద్దేశించి చేసిన కామెంట్, దానికి ఎస్పీబీ నొచ్చుకుని, వివరణ ఇచ్చిన తీరు అందరినీ ఆకర్షిస్తున్నాయి. చిరు అభిమాని ఎస్పీబిని 'మీరు ఎందుకు ఎదుటి వారి నుంచి గౌరవం కోరుకుంటారు.
ఉదాహరణకు మిమ్మల్ని చిరంజీవి 'బాలు..గారూ' అని సంబోదిస్తే కాదు.. కాదు.. నన్ను అన్నయ్య అని మీరు పిలవమని చెప్పారు. చిరు నుంచి మీరు అంత గౌరవం ఎందుకు ఆశిస్తున్నారు? అని ప్రశ్నించాడు. దానికి బాలు బదులిస్తూ.. నేను ఎవ్వరి నుంచి గౌరవం కోరుకునేతత్వం కాదని అన్యాపదేశంగా చెబూతూ, చిరంజీవి తనను ఎప్పటినుంచో అన్నయ్య అని ప్రేమతో పిలిచేవాడని, కానీ ఈ మధ్య 'బాలు..గారూ' అంటున్నారని తెలిపాడు. కొత్తగా నాకు 'గారు'అనే పదం చేర్చడం ఎందుకు? ఒకప్పటిలా ఆప్యాయంగా అన్నయ్యా.. అని పిలిస్తేనే నేను సంతోషపడతానని రిప్లై ఇచ్చాడు. దాంతో ఆ అభిమాని కూడా సారీ చెప్పాడు... ! దటీజ్ ఎస్పీబీ...!