Advertisementt

ఈ సారైనా మహేష్ బాబు వాటికీ చెక్ పెడతాడా..?

Thu 06th Apr 2017 09:30 PM
super star mahesh babu,director murgaadas,koratala siva,music director devi sri prasad  ఈ సారైనా మహేష్ బాబు వాటికీ చెక్ పెడతాడా..?
ఈ సారైనా మహేష్ బాబు వాటికీ చెక్ పెడతాడా..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మహేష్‌ మురుగదాస్‌ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జూన్‌ 23న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో మహేష్‌ పాత్ర షూటింగ్‌ మొత్తం మే నాటికే పూర్తవుతుంది. సాధారణంగా ఓ చిత్రం షూటింగ్‌ తర్వాత మహేష్‌ కాస్తగ్యాప్‌ తీసుకొని, ఫ్యామిలీతో టూర్లకు వెలుతుంటాడు. కానీ ఈ సారి మాత్రం మహేష్‌ మురుగదాస్‌ చిత్రం షూటింగ్‌ పూర్తయిన వెంటనే తనకోసం ఆరునెలలకు పైగా ఎదురుచూస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న 'భరత్‌..అనే నేను' అనే పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రంలో పాల్గొంటాడు.

మహేష్‌ మురుగదాస్‌ చిత్రంలో బిజీగా ఉన్నప్పటికీ కొరటాల మాత్రం తన చిత్రం ప్రీపొడక్షన్‌, లోకేషన్స్‌, దేవిశ్రీతో మ్యూజికల్‌ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. మహేష్‌కు తనకు పెద్ద హిట్‌నిచ్చిన దర్శకులతో మరోసారి పనిచేస్తే అవి పెద్దగా ఆడలేదు. ఒక్క పూరీ తీసిన 'పోకిరి' తర్వాత 'బిజినెస్‌మేన్‌' మాత్రమే బాగా ఆడింది. ఇక కొరటాలతో ఆయన 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత పనిచేస్తున్నాడు. ఈసారైనా మహేష్‌ ఆ బ్యాడ్‌సెంటిమెంట్‌కు చెక్‌ పెడుతాడా? అనే ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది.

తాజాగా కొరటాల చిత్రం విషయంలో మరో బ్యాడ్‌ సెంటిమెంట్‌ను అధిగమించాలని మహేష్‌ భావిస్తున్నాడు. ఆయన నటించిన '1' (నేనొక్కడినే) చిత్రం షూటింగ్‌ ఎక్కువగా లండన్‌లో జరిగింది. కొరటాల చిత్రంలో కూడా కీలక సన్నివేశాలతో కూడిన ఒక షెడ్యూల్‌ను లండన్‌లోనే ప్లాన్‌ చేశారు. మరి లండన్‌ సెంటిమెంట్‌ను కూడా మహేష్‌ అధిగమిస్తాడో లేదో చూడాలి....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ