పూరీజగన్నాథ్... అతను ఓ డైనమిక్. పడిలేచే కెరటం.. పాజిటివ్ థింకర్.. కానీ ఆయన కూడా కొన్ని విషయాలలో ప్రవర్తిస్తున్న తీరు చూస్తే బాధ కలుగుతుంది. పూరీకి మీడియాపై కూడా ఎంతో కోపం ఉంది. దీనిలో తప్పులేదు. అందుకే ఆయన తాను మహేష్‌బాబుతో తీసిన చిత్రంలో షాయాజీషిండే చేత మీడియాపై సెటైర్లు కురిపించాడు. అవి అద్భుతంగా పేలాయి. వాటిని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. దాంతో ఆయన మరలా మీడియాను టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా ఈ వెబ్‌సైట్స్, వారు ఇచ్చే రివ్యూలు, రివ్యూ రేటింగ్ వల్ల కలిగే నష్టాలు... జర్నలిస్ట్‌ల పోకడలను ఎండగడుతూ రవితేజతో తీసిన 'నేనింతే' చిత్రంలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయాడు.
కానీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక తాజాగా పూరీ 'రోగ్' అనే ఓ రొటీన్ చిత్రం తీశాడు. దానికి అత్యధికంగా అన్ని వెబ్‌సైట్ల నుంచి, మీడియా నుంచి చాలా తక్కువ రేటింగ్సే వచ్చాయి. ఇక నేటిరోజుల్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్‌మీడియాలో వెబ్‌సైట్స్ కూడా తామరతంపరగా వేలాది వచ్చేశాయి. కానీ తన 'రోగ్' బాగా లేకపోయిన కూడా ప్రమోషన్ చేసి, బాగుంది అని చెప్పడం తప్పుకాదు. అది దర్శకనిర్మాతల హక్కు. ఎందుకంటే మీడియా మంచి రేేటింగ్స్ ఇచ్చినంత మాత్రాన సినిమాలు జనాలు చూడరు. రేటింగ్స్ బాగా లేవని ఇచ్చినా కూడా బాగుందని బాగా ఆడిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
మాకు తెలిసినంతలో పూరీ-మహేష్‌ల 'పోకిరి, బిజినెస్‌మేన్' వంటి చిత్రాలకు కూడా తక్కువ రేటింగ్స్ వచ్చినా కూడా అవి బాగా ఆడాయి. కానీ పూరీ 'రోగ్' కోసం చేసిన గిమ్మిక్ మాత్రం చాలామందిని ఆశ్యర్యపరిచింది. ఆయన 'రోగ్' చిత్రానికి మంచి రేటింగ్స్ ఇచ్చిన కొన్ని వెబ్‌సైట్స్‌ను ప్రచారం చేస్తూ ప్రమోషన్ చేశాడు. మీడియాపై సదభిప్రాయం లేనప్పుడు మీడియాను ఉదాహరణగా చూపించడం అనవసరం. ఇక '143' చిత్రం ద్వారా పరిచయమైన ఆయన తమ్ముడు సాయిరాంశంకర్ నటన ఆ చిత్రానికి మైనస్ అయిందని విమర్శించిన పాపానికి ఓ జర్నలిస్ట్‌ను ఓ పత్రిక నుండి తప్పించేలా యాజమాన్యాన్ని ఒప్పించి అనుకున్నది సాదించాడు. కానీ అదే పూరీ ఆ తర్వాత నిజం తెలుసుకొని సాయిరాంశంకర్ వాయిస్‌కి డబ్బింగ్ చెప్పించాడు... సో..సారీ పూరీ....!