Advertisementt

మెగాహీరోలు, నాని అతనికి హెల్ప్ అవుతారా..?

Wed 05th Apr 2017 09:35 PM
raviraja pinisetty,aadhi pinisetty,pawan kalyan,ram charan,nani  మెగాహీరోలు, నాని అతనికి హెల్ప్ అవుతారా..?
మెగాహీరోలు, నాని అతనికి హెల్ప్ అవుతారా..?
Advertisement
Ads by CJ

తెలుగులో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి రవిరాజా పినిశెట్టి. ఇక ఆయన తనయుడు ఆది పినిశెట్టిలో మంచి టాలెంట్‌ ఉన్నప్పటికీ మనవారు గుర్తించలేదు. కానీ ఆయన తమిళంలో తానేమిటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక మొత్తానికి అతనికి తెలుగులో బన్నీ నటించిన 'సరైనోడు' చిత్రంలో బన్నీ హీరోయిజాన్ని ధీటుగా విలనిజం పడించే పాత్రను పోషించి మెప్పించాడు. కాగా ప్రస్తుతం ఈ కుర్రహీరో మరో మెగాహీరో రామ్‌చరణ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో 'చరణ్‌కు సోదరుడిగా నటిస్తున్నాడు. ఇక పవన్‌ కూడా ఈ యంగ్‌యాక్టర్‌కి మంచి అవకాశం ఇచ్చాడు.

పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో ఓ కీలకపాత్రను ఇచ్చాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ హీరోగా నటించే చిత్రం కాబట్టి ఈ చిత్రం హిట్టయితే ఆది పినిశెట్టికి తెలుగులో కూడా మంచి గుర్తింపు రావడం ఖాయమనే చెప్పాలి. ఇందులో ఆది యంగ్‌ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. మరోపక్క నేచురల్‌స్టార్‌ నాని కూడా తన తాజా చిత్రం 'నిన్నుకోరే'లో ఆది పినిశెట్టికి మంచి పాత్రనుఇచ్చాడు. సో.. రవిరాజాకి ఉన్న గుర్తింపు ఈ యువహీరో తెలుగులో స్ధిరపడటానికి ఉపయోగపడని నేపధ్యంలో మెగాహీరోలు, నానిల చలవతో అయినా ఆయన కెరీర్‌ ఎదుగుతుందని ఆశిద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ