Advertisementt

మూడురోజుల కోసం పోటీ మొదలు..!

Wed 05th Apr 2017 03:30 PM
pawan kalyan,jr ntr,akhil,ram charan,ravi teja,director sukumar,puri,mahesh babu  మూడురోజుల కోసం పోటీ మొదలు..!
మూడురోజుల కోసం పోటీ మొదలు..!
Advertisement
Ads by CJ

పలువురు స్టార్స్‌, మీడియం హీరోల చిత్రాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. బాలకృష్ణ, పవన్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌, రవితేజ.. ఇలా అందరూ తమ చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. పవన్‌ 'కాటమరాయుడు' రిలీజైన రెండు వారాల లోపే త్రివిక్రమ్‌ చిత్రంలో పాల్గొన్నాడు. చరణ్‌ 'దృవ' తర్వాత, ఎన్టీఆర్‌ 'జనతా గ్యారేజ్‌' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని, దర్శకులకు చాలా సమయం ఇచ్చి, ఆ సమయంలో తాము మేకోవర్‌ అయి, ఒక్కసారిగా సినిమా షూటింగ్స్‌ మొదలుపెట్టారు. ఇక ఎన్టీఆర్‌ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజే రిలీజ్ చేశారు.

చరణ్‌-సుక్కు చిత్రం కూడా మొదలైపోయింది. 'చిరుత' సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తూ చరణ్‌ సుక్కు చిత్రాన్ని ఓ పాటతో ప్రారంభించేశాడు. ఇక పూరీ సంగతి అందరికీ తెలిసిందే. హిట్టా ఫ్లాపా అనేది పక్కనపెడితే సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేస్తాడు. ఇక అఖిల్‌ ఎంతో గ్యాప్‌ తర్వాత రెండో చిత్రాన్ని విక్రమ్‌కె.కుమార్‌ దర్శకత్వంలో స్పీడ్‌గా ముగించేయాలని చూస్తున్నాడు. కాగా వీరిలో ఎక్కువమంది దృష్టి మాత్రం రంజాన్‌ ముందు వచ్చే శుక్రవారం మీద ఉంది. వరుసగా నాలుగురోజుల వీకెండ్‌ వస్తోంది.

ప్రస్తుతం మొదలుపెట్టిన సినిమాలు పక్కనపెడితే ఆల్‌రెడీ షూటింగ్‌లో ఉన్న మహేష్‌ చిత్రంతో పాటు మరికొన్ని ఈ వీకెండ్‌ని క్యాష్‌ చేసుకోనున్నాయి. ఇక ఆగష్టు11న కూడా లాంగ్‌వీకెండ్‌ వస్తోంది. దసరా సెలవుల సీజన్‌ మామూలే. మరి ఈ మూడు తేదీల్లో ఎన్ని చిత్రాలు విడుదలవుతాయి? పవన్‌, ఎన్టీఆర్‌ వంటి వారు ఆగష్టు11కి రాగలరా? అప్పుడు రాకపోతే దసరా పోటీ ఎలా ఉండనుంది? అనేవి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ