చంద్రబాబు తన కేబినెట్ విస్తరణలో తమకు కూడా అవకాశం ఇస్తాడని పలువురు ఆశించి భంగపడ్డారు. సీనియర్ కార్యకర్తలకు ప్రమోషన్లు ఇవ్వకుండా జూనియర్ కార్యకర్తలకు రిజర్వేషన్లు కల్పించాడని సెటైర్లు వేస్తున్నారు. చివరకు పయ్యావుల కేశవ్‌కే పదవి దక్కలేదంటే ఆశ్యర్యమే మరి...! కాగా ఈమధ్య యువత మంత్రం బాగా జపిస్తున్న చంద్రబాబు, యువ నాయకులను మాత్రం ప్రోత్సహించలేదు. కొత్తగా ఎన్నికైన కొందరు కొత్త ఎమ్మెల్యేలు కూడా పదవులు ఆశించారు. కానీ అలాంటి నాయకులను చంద్రబాబు తీవ్రంగా మందలించాడు. మొదటిసారి ఎమ్మెల్యేలైన మీకు అంత తొందర ఎందుకు? మీకు ఇంకా చాలా అనుభవం కావాలి అని సూక్తులు చెప్పి, హెచ్చరించాడు.
మరి మొదటిసారిగా... అది కూడా దొడ్డిదారిన శాసనమండలికి ఎన్నికై, రోజుల అనుభవం లేని తన కుమారుడు లోకేష్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చాడు? సానుభూతితో ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియ మొదటిసారి గెలిచిందే కదా...! మనకు తెలియకుండా ఆమె ఎప్పుడైనా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా అయిందో ఎవ్వరికీ అర్దం కావడం లేదు. మరి చంద్రబాబు దృష్టిలో లోకేష్, అఖిలప్రియలు అనుభవం ఉన్నవారా? యువత అంటే వారిద్దరేనా? ఇది చంద్రబాబుకే తెలియాలి....!