బాలకృష్ణ తన 101 వ చిత్రాన్ని పూరి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. పూరి గురించి ఎవరెన్ని చెప్పిన వినకుండా బాలకృష్ణ తన 101వ ప్రాజెక్ట్ ని పూరి చేతిలో పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే మొదలైన ఈ చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అయ్యింది . మొదటి షెడ్యూల్ లో బాలకృష్ణ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన పూరి ఇప్పుడు రెండో షెడ్యూల్ లో బాలకృష్ణ, హీరోయిన్ ముస్కాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఒక భారీ సెట్ ని వేయిస్తున్నాడట.
1. 5 కోట్ల రూపాయల వ్యయంతో భారీ కాలనీ, మార్కెట్ సెట్ ను బాలకృష్ణ కోసం పూరి వేయించాడట. ఈ సెట్ లోనే బాలయ్య, ముస్కాన్ లపై ఆ సన్నివేశాలను చిత్రకరిస్తారని సమాచారం. మరి ఇప్పటికే బాలయ్యని మునెపెన్నడూ చూపెట్టని విధంగా చూపెట్టి ఫ్యాన్స్ మెచ్చేలా చేస్తానని చెప్పిన పూరి, బాలకృష్ణ ని ఎలా చూపిస్తాడో అనే ఆత్రుత అభిమానులకు విపరీతంగా పెరిగిపోతుంది.