Advertisementt

అందుకే మళ్లీ రీఎంట్రీ ఇచ్చిందట..!

Tue 04th Apr 2017 05:18 PM
heroine bhumika chawla,nani,bhumika re entry in movies  అందుకే మళ్లీ రీఎంట్రీ ఇచ్చిందట..!
అందుకే మళ్లీ రీఎంట్రీ ఇచ్చిందట..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలగకపోయినా... దాదాపు పెద్ద స్టార్స్ అందరితో నటించింది హీరోయిన్ భూమిక. కెరీర్ పీక్ స్టేజి లో ఉండగానే యోగ గురువుని పెళ్లి చేసుకుని రీల్ లైఫ్ ని వదిలేసి రియల్ లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి చేసుకున్నాక భూమిక హీరోయిన్ గా కంటే సినిమాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఒక్క సినిమాతోనే చాలా నష్టపోయింది. ఇక అప్పటి నుండి సైలెంట్ అయిన భూమిక కి ఈ మధ్యన ఆర్ధిక కష్టాలు ఎక్కువయ్యాయని అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు భూమిక మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. 

భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో ధోని చిత్రంలో హీరోకి అక్కగా నటించింది. ధోని చిత్రం హిట్ అయినప్పటికీ  కూడా భూమిక అనుకున్న క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు అలాగే  కేరెక్టర్ పాత్రలు చెయ్యడానికి సిద్ధపడిపోయింది. అందులో భాగంగానే ఇప్పుడు నాని హీరోగా వస్తున్న ఒక చిత్రంలో నానికి అక్కగా నటించేందుకు భూమిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే ఇలా భూమిక కేరెక్టర్ పాత్రలు ఒప్పుకోవడానికి కారణం మాత్రం కేవలం ఆర్ధిక సమస్యలు ఉండడం వలెనే అని అంటున్నారు. ఇక ఇప్పుడు అక్కా. చెల్లి పాత్రలకు మంచి పేరు గనక వస్తే భూమిక ఇక ఇలానే సినిమాల్లో కంటిన్యూ అవుతుందని అంటున్నారు. చూద్దాం భూమిక సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ