పాపం అక్కినేని వారి ఇంట ఇప్పట్లో పెళ్లి భాజాలు మోగేలా కనిపించడం లేదు. ఇప్పటికే అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి కొంచెం అప్ సెట్ అయినప్పటికీ సమంత - నాగ చైతన్యల పెళ్లితో అది కాస్తా పోతుందని అనుకున్నారంతా. కానీ సామ్ - చై ల పెళ్లి కూడా ప్రస్తుతానికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. వీరి పెళ్లి ఈ ఏడాది చివరి నుండి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.
సమంత - నాగ చైతన్య ల పెళ్లి వాయిదాకి కారణం వాళ్ళిద్దరేనట. అదెలాగంటే నాగ చైతన్య చేతినిండా సినిమాలతో బిజీ కాగా సమంత కూడా ఉన్నట్టుండి టాలీవుడ్ లో అవకాశాలతో ఊపిరి సలపకుండా ఉండడమే ఈ పెళ్లి వాయిదాకి కారణమట. నాగ చైతన్య ఇప్పటికే 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం తో బిజీగా ఉండగా... సమంత ఏకంగా రెండు మూడు సినిమాలతో బిజీ అయ్యింది. సమంత చేతిలో ఇప్పుడు 'రాజుగారి గది 2 , మహానటి', రామ్ చరణ్ తో ఒక చిత్రం కమిట్ అయ్యింది. ఇక ఈ చిత్రాలతో పాటే ఎన్టీఆర్ కొత్త చిత్రంలో కూడా సమంత లీడింగ్ రోల్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
మరి ఇవన్నీ పూర్తవ్వాలంటే సమంత కి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది.... కాబట్టే వీరి పెళ్లిని వచ్చే ఏడాదికి పోస్ట్ చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి అక్కినేని ఫ్యామిలీ కూడా సరే అన్నట్లు చెబుతున్నారు. మరి అక్కినేని ఫ్యామిలీ కి కూడా ఇప్పుడు సమంత - నాగ చైతన్య ల పెళ్లి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా చెయ్యాలనుకుంది. కానీ ఇప్పుడు వారి సినిమాల బిజీ వల్ల పెళ్లి కొద్దీ కాలం వాయిదా పడింది మరి.