ఈ మధ్య 'ఊపిరి' చిత్రంతో పాటు పలు చిత్రాలలో నాగార్జున వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు తనను అందరూ 'యువ సమ్రాట్ అని పిలుస్తూ, రాస్తుంటే.. నా ఈ వయస్సులో నేను ఇంకా 'యువ సమ్రాట్'ని ఏమిటి? కావాలంటే నాగచైతన్య వంటి వారిని అలా పిలవండి.. నన్ను బిరుదుతో పిలవాలని ఉంటే 'కింగ్'అని పిలవమని ఓపెన్‌గా చెప్పాడు. ఇక వెంకీ ఎప్పుడూ సమ్‌థింగ్‌స్పెషలే. మల్టీస్టారర్‌చిత్రాలే కాదు.. వయసు మీద పడ్డ పాత్రలను కూడా ఆయన 'దృశ్యం' తోపాటు 'గురు'లో చేశాడు. ఇక తన వయసుకి తగ్గ పాత్రలు చేయకుండా కాస్త రొటీన్‌గా వెళ్లిన 'షాడో, బాబు బంగారం' వంటి చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఇక వయసుకు తగ్గ పాత్రను చేస్తానని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
ఇక నాగ్, వెంకీ వంటి సీనియర్ స్టార్స్ అంతటి ఇమేజ్ లేనప్పటికీ ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగానే కాదు.. 'గాయం, అంత:పురం, సముద్రం' వంటి చిత్రాలలో జగపతిబాబు మెప్పించాడు. ఇక ఆయన కూడా ప్రస్తుతం విభిన్నంగా వెళ్తూ తన వయసుకు తగ్గట్లుగా తెల్లబడిన గడ్డంతో, హెయిర్‌స్టైల్‌తో విలన్‌గా, తండ్రిగా, బహురకాల విభిన్న పాత్రలను చేస్తున్నాడు. 'లెజెండ్'లో విలన్‌గా, 'శ్రీమంతుడు'లో మహేష్ తండ్రి పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు. ఆయన 'నాన్నకు ప్రేమతో' వంటి చిత్రాల విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న 'పటేల్‌సార్' చిత్రం టీజర్ మంచి స్పందనను రాబడుతోంది. యూట్యూబ్‌లో కూడా ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సో.. నాగ్, వెంకీ, జగపతిబాబు వంటి హీరోల వల్లనేనా తెలుగులో వైవిధ్యభరితమైన, సాహసోపేతమైన పాత్రలు వస్తాయేమో అనే ఆశలు రెక్కెతుతున్నాయి. బాలీవుడ్‌లో అమితాబ్, మలయాళంలో మోహన్‌లాల్ 'కనుపాప'.. ఇలా ఈ తరహా చిత్రాలలో బిగ్‌బి స్థాయిలో కాకపోయినా ఈ ముగ్గురు విభిన్న చిత్రాలతో మన ముందుకు వస్తారేమోనని ఈ ముగ్గురిపై ఆశలు రేకెత్తుతున్నాయి.