Advertisementt

150 మిస్సయినా..151 లో మాత్రం పక్కా అంట..!

Tue 04th Apr 2017 11:02 AM
venkatesh,khaidi no 150,ram charan,chirajeevi,uyyalawada narasimha reddy,chiru 151 movie  150 మిస్సయినా..151 లో మాత్రం పక్కా అంట..!
150 మిస్సయినా..151 లో మాత్రం పక్కా అంట..!
Advertisement
Ads by CJ

చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక టైమ్ వెస్ట్ చెయ్యదలుచుకోకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150' తో హిట్ కొట్టేసిన చిరు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. అటు సినిమాల్లోనూ ఇటు బుల్లితెర మీద 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో తో బిజీ బిజీ అయిన చిరు ఇప్పుడు ఉయ్యాలవాడను పట్టాలెక్కించే పనిలో వున్నాడు. ఈ చిత్రానికి రామ్ చరణ్ మరోసారి తన కొణిదెల ప్రొడక్షన్  బ్యానర్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే ఈ చిత్రం మొదలుకాక ముందే ఈ చిత్రంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అదేమిటంటే చిరు 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కేవలం ప్రచారం కాదని నిజంగానే వెంకీ. చిరు చిత్రంలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఇదే విషయంపై రామ్ చరణ్ వెంకటేష్ తో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి. అసలు వెంకీ..బాలీవుడ్ హీరో సల్మాన్ తో కలిసి.. చిరు 150  చిత్రం 'ఖైదీ... 'లో ఒక సాంగ్ లో కనిపించాలనుకున్నారట. కానీ వెంకీ కి కాలు నొప్పి చేయడంతో అది అప్పట్లో కుదరలేదట.

కానీ ఇప్పుడు మాత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలో మాత్రం ఒక కీలక పాత్రలో వెంకటేష్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. సో...ఇప్పటికే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో హంగామా చేసిన చిరు, వెంకీ లు..రాబోయే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' లో ఎలా సర్ ప్రైజ్ చేస్తారో చూద్దాం..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ