హిందీలోని 'కౌన్‌బనేగా కరోడ్‌పతి' కార్యక్రమాన్ని తీసుకుని రూపొందిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. మాటీవీలో ప్రసారమైన మొదటి మూడు సీజన్లకు నాగ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. కానీ మొదటి సీజన్‌తో పోల్చుకుంటే మిగిలిన రెండు సీజన్లకు టీఆర్పీ రేటింగ్స్ తగ్గాయి. దాంతో కొన్ని కారణాలను సాకుగా చూపి నాలుగో సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవిని హోస్ట్‌గా తీసుకున్నారు. కానీ ఈ ప్రోగ్రాం వీక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోతోంది. టీఆర్పీలు దారుణంగా ఉన్నాయి. దీంతో ఈ షోని కంటిన్యూ చేయాలా? లేదా? అనే డైలమాలో కొత్త మా టీవీ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. నాగ్‌ని చూసి చూసి వీక్షకులకు బోర్ కొట్టి టీఆర్పీలు తగ్గుతున్నాయని భావించిన వారికి చిరు ఇమేజ్, ఫ్యాన్స్ క్రేజ్ దీనికి ప్లస్ కాకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా వీక్షకుల ఆదరణ లేకపోతే లక్షలకు లక్షలు చెల్లించి చిరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వృథా ప్రయాసే అని వారు ఫీలవుతున్నారు.
నాగ్ సరే చిరు కూడా దీనిని కాపాడలేకపోవడంతో ఈ షో క్రేజ్ తగ్గుతూ రావడానికి కేవలం హోస్ట్‌లే కారణం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ ప్రోగ్రాం మరలా ఊపులోకి రావాలంటే ఏయే మార్పులు చేర్పులు చేయాలనే దానిపై సదరు చానెల్ సర్వే కూడా చేయిస్తోంది. దీని ఫలితం బట్టి దీనిని ఆపేయాలా? లేదా? అనే నిర్ణయం వెలువడనుంది. అయితే అర్థాంతరంగా ఆపేస్తే చిరు ఇమేజ్‌కి దెబ్బ అనే అభిప్రాయం కూడా రావడంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా? అని యాజమాన్యం తలలు పట్టుకుంటున్నారని సమాచారం.
ఇక ఎప్పుడు లేని విధంగా చిరు హోస్ట్‌గా ప్రారంభమైన నాలుగో సీజన్ మొదటి నుంచే సెలబ్రిటీలను, స్వయాన నాగ్, వెంకీ వంటి వారిని కూడా ఆహ్వానిస్తున్నా, ఫలితంలో పెద్దగా మార్పు రావడం లేదంటున్నారు. ఇక ఇంతకాలం విద్యార్ధులకు పరీక్షా సమయం కాబట్టి వీక్షకులు తగ్గారనే వంక చూపుతూ వచ్చారు. ఇకపై ఆ అవకాశం కూడా లేకపోవడంతో అందరూ విస్తుపోతున్నారు. ఈ చిక్కు ముడిని ఎలాంటి వివాదాలు లేకుండా సంస్థ ఎలా పరిష్కరింస్తుందో వేచిచూడాల్సివుంది...!