తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తన స్వస్థలమైన నెల్లూరుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవంలో పలువురు మంత్రులతో పాల్గొన్నాడు. అప్పుడే ఆయన సభలో మాట్లాడుతూ, తన వెనక నిలబడి గలభా చేస్తున్న వారిని ఉద్దేశించి.. నాకు ఎదురుగా నిలబడే వారంటేనే ఇష్టం. వెనక నుండే వారిని నేను నమ్మను. గతంలో అలా వెనుక ఉన్న వారే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు.. అని వ్యాఖ్యానించాడు. దీనిని కొన్ని చానెల్స్ పని గట్టుకుని వెంకయ్యనాయుడు.. చంద్రబాబు నాయుడును ఉద్దేశించే ఈ వ్యాఖ్యానాలు చేశాడని, ఆయన మాటలను పదే పదే చానెల్స్‌లో చూపిస్తూ వస్తున్నాయి.
కానీ ఆ సభలో వెంకయ్య స్పష్టంగా ఒక మాట అన్నాడు. 1984లో ఇలాగే వెనుక ఉండే వారే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించాడు. కానీ ఆ మాటలను మాత్రం ఓ చానెల్ ఎడిట్ చేసి పదే పదే వెంకయ్య, చంద్రబాబును దెప్పి పొడిచాడని చూపించింది. కానీ వెంకయ్య మాత్రం 1984లో అని స్పష్టంగా నాదేండ్లభాస్కర్‌రావును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడు. మరి ఎలక్ట్రానిక్ మీడియా మరీ ఇంతలా దిగజారితే ఎలా...?