Advertisementt

అప్పుడు రాజమౌళి...ఇప్పుడు అమలాపాల్!

Mon 03rd Apr 2017 08:39 PM
amala paul,yoga,gautam buddha,rajamouli,chatrapati  అప్పుడు రాజమౌళి...ఇప్పుడు అమలాపాల్!
అప్పుడు రాజమౌళి...ఇప్పుడు అమలాపాల్!
Advertisement
Ads by CJ

కొందరు అనుకోకుండా చేస్తారో? లేక అన్నీ తెలిసినా వివాదాలలో ఉండాలని చేస్తారో గానీ చాలా పెద్ద తప్పులు చేస్తారు. అమలాపాల్‌ దర్శకుడు విజయ్‌తో విడాలకులు తీసుకున్న తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయింది, ధనుష్‌తో 'విఐపి2, వాడచెన్నై', విష్ణుతో మరో చిత్రం చేస్తోంది. ఇక మలయాళంలో మూడు చిత్రాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం 'హెబ్బులి'లో రెచ్చిపోయి నటించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఓ యోగా స్టిల్స్‌లో హాట్‌ హాట్‌గా కనిపిస్తూ ఫొటో షూట్‌ చేసింది. ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. కాగా అందులో ఆమె ఓ శీర్షాసనం స్టిల్‌ ఇచ్చింది. ఆమె ఫొటోలు దిగిన గదిలో గోడకు నిలువెత్తు బుద్దుడి పెయింటింగ్‌ ఉంది. ఆమె కాళ్లు బుద్దుడి మొహాన్ని తగులుతున్నాయి. ఈ ఫొటోపై వివాదం చెలరేగుతోంది. 

ఈ సందర్భంగా ఎప్పుడో వచ్చిన ఓ చిత్రాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చి ఘనవిజయం సాధించిన 'ఛత్రపతి' చిత్రంలో విశాఖపట్టణం ఉండే ప్రాంతాన్ని ఇండియా మ్యాప్‌పై ప్రభాస్‌ తన కాలితో ముద్ర వేస్తాడు. అంటే హీరోయిజంను పీక్స్‌లో చూపించడానికి భారతమాత చిత్ర పటంలోని వైజాగ్‌ ప్రాంతంపై హీరో చేత రాజమౌళి కాలితో తొక్కించాడు. ఇలాంటివి కావాలని చేస్తారా? లేక తమ పబ్లిసిటీ కోసం చేస్తారా? లేక క్రియేటివిటీ అధికమై ఇలా చేస్తారా? అనేది అర్థం కాని విషయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ