పవన్ మారడని అర్దమవుతోంది. ఆయన నటించిన తాజా చిత్రం 'కాటమరాయుడు' పూర్తి ఫలితాలు సోమ, మంగళవారాల కలెక్షన్లతో తేలిపోతుంది. ఈ చిత్రం బయ్యర్లకు ఎంత నష్టం తీసుకొని వచ్చిందో లెక్కలతో సహా తేలిపోతుంది. మొదటి వీకెండ్, ఆ తర్వాత ఉగాది, ఇప్పుడు రెండో వీకెండ్.. ఇలా జరిగింది. కానీ రేపు, ఎల్లుండి మాత్రం పూర్తి చిత్ర పటం కనిపిస్తుంది. పవన్ మాత్రం ఇప్పటికీ పలు చోట్లనే కాదు... తన సన్నిహితులతో కూడా వర్మ చెప్పినట్లుగానే నా చిత్రాలు నా ఇష్టం. నేను చూడమని బలవంతం చేయడం లేదు. నచ్చితే చూడండి.. నచ్చకపోతే మానేయండి... అని అంటున్నాడు.
మరి 'సర్దార్ గబ్బర్‌సింగ్' ద్వారా నష్టపోయిన వారి కోసం 'కాటమరాయుడు' చేశాడు. రేపు 'కాటమరాయుడు' నష్టాల కోసం మరో చిత్రం చేస్తాడు. ఇక ఇలా ఆయన కెరీర్ కొనసాగాల్సిందేనా? అనే అనుమానం వస్తోంది. ఇక త్రివిక్రమ్ తర్వాత చిత్రమైనా ఆయన మాట ఇచ్చినట్లు దాసరికి చేస్తాడని పలువురు భావించారు. కానీ ఎ.యం.రత్నం, దాసరిల స్థానంలో మరోసారి పవన్ భక్తుడిగా నటించే బండ్ల గణేష్ తన్నుకుపోతున్నాడని సమాచారం. ఇక తాజాగా దాసరి అనారోగ్యంతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఓ సినిమా పవన్ చేస్తే బాగుంటుందని దాసరి శ్రేయోభిలాషులు భావించారు. కానీ ఇప్పుడు మరలా బండ్ల, ఆ తర్వాత మళ్ళీ శరత్‌మరార్‌లే తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.