ఈ చిత్రం చూసిన తర్వాత చిరంజీవి గారు నా చాయిస్‌ను మెచ్చుకున్నారు. నాకు హ్యాట్సాఫ్ చెప్పారు. నా గెటప్‌తో పాటు నాది నీ తండ్రి వయసు అని చెప్పడం కూడా సులభం కాదని, దానికెంతో దైర్యం కావాలని నన్ను మెచ్చుకున్నారు. ఈ చిత్రం చూసి ఆయన 'హ్యాట్సాఫ్ టు యు' అని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. నువ్వు 'గురు' చిత్రంలోనే కాదు.. ఎప్పుడు రిస్క్ తీసుకుంటావని చిరు గారు నన్ను అభినందించారు. నా రిస్క్‌ను, చాయిస్‌ని ఎంతో మెచ్చుకున్నారు... అని వెంకటేష్ 'గురు' చిత్రం విషయంలో చిరు తనతో అన్నమాటలను తెలిపారు.
ఈ చిత్రం చూసిన వారెవ్వరైనా చిరంజీవి వ్యాఖ్యలతో ఖచ్చితంగా ఏకీభవిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని మొదట చూడటానికి చిరంజీవి భార్య పెద్దగా ఆసక్తి చూపలేదట. బాక్సింగ్ నేపథ్యం కదా...! ఆ ఏముంటుందిలే అని ఆమె భావించారట. కానీ సినిమా చూసిన తర్వాత ఇది స్టోర్ట్స్ చిత్రమే కాదు..ఎన్నో ఎమోషన్స్ ఉన్న చిత్రం అని చెప్పి ఆమె కంటతడిపెట్టుకుని ఉద్వేగానికి లోనైనట్లు దర్శకురాలు సుధా కొంగర తెలిపారు. మొత్తానికి సుద చిత్రంతో తాను క్రియేటివ్ జీనియస్ మణిరత్నం నిజమైన శిష్యురాలినని ప్రూవ్ చేసింది. హ్యాట్సాఫ్ టు 'గురు' టీం....!