Advertisementt

అఖిలే..అలియా భట్ ని లైన్లో పెట్టాడంట..!

Sun 02nd Apr 2017 11:18 PM
akhil akkineni,alia bhatt,vikram k kumar,akhil with alia bhatt  అఖిలే..అలియా భట్ ని లైన్లో పెట్టాడంట..!
అఖిలే..అలియా భట్ ని లైన్లో పెట్టాడంట..!
Advertisement
Ads by CJ

అఖిల్ రెండో చిత్రం విక్రమ్ డైరెక్షన్ లో ఇంకా పట్టాలెక్కలేదుగాని వీరి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంపై రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఎప్పటినుండో అఖిల్ రెండో సినిమా పేరు 'జున్ను' అని ప్రచారం జరుగుతుండగా ఇపుడు అదే కన్ఫర్మ్ అంటున్నారు. అసలు అఖిల్ మొదటి సినిమా 'అఖిల్' షాక్ నుండి కోలుకోవడానికి చాలా టైమే పట్టింది. ఈ టైమ్ లో అఖిల్ పర్సనల్ లైఫ్ లో అయినా సెటిలవుదామనుకున్నాడు. కానీ అది కొన్ని కారణాల వల్ల జరగలేదు.

ఇక ఇప్పుడు తన రెండో సినిమా మొదలు పెట్టడానికి ముందే ఈ సినిమాకి సంబందించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిల్ రెండో చిత్రానికి హీరోయిన్ గా బాలీవుడ్ భామ అలియా భట్ ని తీసుకుంటున్నట్లు  వార్తలొస్తున్నాయి. అలియా భట్ తన రెండో చిత్రానికి హీరోయిన్ గా కావాలని అఖిలే పట్టుపడుతున్నాడట. అయితే అఖిల్, అలియా భట్ ని తన రెండో చిత్రంలో నటించడానికి ఒప్పించేందుకు కొంతకాలం ముంబైలో మకాం వేసి మరీ ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే అఖిల్ తన తండ్రి నాగార్జున కు భట్ ఫ్యామిలీతో ఉన్న ఫ్రెండ్ షిప్ ని వాడుకున్నట్లు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అసలయితే అఖిల్ చిత్రంలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అఖిల్ చిత్రానికి అలియా భట్ హీరోయిన్ అంటున్నారు. అసలు అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్' లోనే అఖిల్, అలియా భట్ తో జోడి కడుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం అఖిల్ రెండో చిత్రంలో అలియా భట్ కన్ఫర్మ్ అంటున్నారు. చూద్దాం అలియా భట్టా.. లేక మారేవరన్ననా... అనేది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ