Advertisementt

నిజంగా వెంకీ చాలా గ్రేట్‌ గురూ...!

Sun 02nd Apr 2017 11:10 PM
venkatesh,guru,venkatesh about fans  నిజంగా వెంకీ చాలా గ్రేట్‌ గురూ...!
నిజంగా వెంకీ చాలా గ్రేట్‌ గురూ...!
Advertisement
Ads by CJ

తమ ఫ్యాన్స్‌ తమ మాయలో పడి జీవితాలను, చదువులను నాశనం చేసుకోవడం నిజంగా కొంత మంది స్టార్స్‌కి అసలు నచ్చదు. పవన్‌ వంటి స్టార్స్‌ అందుకే పెద్దగా తమ ఫంక్షన్స్‌ను బహిరంగంగా, ఆర్భాటంగా జరపాలని కోరుకోరు. ఇది నిజం..తమ మీద అభిమానంలో అభిమానులు తొక్కిసలాటల్లో గాయపడటం వంటివి వారు జీర్ణించుకోలేరు. ఇదే విషయం తాజాగా 'గురు' చిత్ర సమయంలో విక్టరీ వెంకటేష్‌ తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ, నేను నా కోసం ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వచ్చి హంగామా చేయాలని, హడావుడి చేయాలని భావించను. వారంతా కుటుంబ సమేతంగా నా చిత్రాలు చూడాలని, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటాను. నా కెరీర్‌ పీక్‌స్టేజీలో ఉన్నప్పుడు కూడా నా అభిమానులు హంగామా చేయాలని భావిస్తే నేను వద్దని చెప్పేవాడిని. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. దాంతో నా అభిమానులు నిరుత్సాహపడేవారు. కానీ నేను అదే ఫాలో అవుతున్నాను. ఇక నేను రికార్డ్స్‌తో పాటు నెంబర్‌గేమ్‌ను కూడా పట్టించుకోను... అది నా మనస్తత్వం. కాబట్టి నేను అలాగే కంటిన్యూ అవుతున్నాను... అని తనదైన వేదాంతశైలిలో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నిజంగా వెంకీ చాలా గ్రేట్‌ గురూ...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ