Advertisementt

ప్రభాస్, మహేష్, అఖిల్ సినిమాల టైటిల్స్ ఇవేనా!

Sun 02nd Apr 2017 09:45 PM
prabhas,sahoo,mahesh,spyder,akhil,junnu,yekkada yekkada vundo taraka  ప్రభాస్, మహేష్, అఖిల్ సినిమాల టైటిల్స్ ఇవేనా!
ప్రభాస్, మహేష్, అఖిల్ సినిమాల టైటిల్స్ ఇవేనా!
Advertisement
Ads by CJ

'బాహుబలి' తర్వాత ప్రభాస్.. సుజిత్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా సినిమా మొదలవ్వకముందే ప్రభాస్ సినిమా టైటిల్ ని  యూవీ క్రియేషన్స్ బ్యానర్ రిజిస్టర్ చేయించినట్లు వార్తలొస్తున్నాయి. ప్రభాస్ కోసం సుజిత్ -  యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు  'సాహో' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారని టాక్. ఇప్పటికే  'సాహో' అనే పదం 'బాహుబలి' చిత్రంలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అందుకే అందరి నోట్లో ఈ  'సాహో' అనే పదం బాగా నానుతుంది కాబట్టి ఈ టైటిల్ తొందరగా ప్రేక్షకులు కు చేరువవుతుందనే ఉదేశ్యంతో సుజిత్ ఈ టైటిల్ ని ఒకే చేయించాడని అంటున్నారు.

ఇక మహేష్, మురుగదాస్ చిత్రం మొదలుపెట్టి షూటింగ్ చివరి దశకు చేరుకున్నా కూడా ఇప్పటివరకు టైటిల్ ని పెట్టకుండా మహేష్ అభిమానులని ఊరిస్తూవస్తున్న మురుగదాస్ ఇప్పుడు మహేష్ చిత్రానికి 'స్పైడర్' అని టైటిల్ ని సెలెక్ట్ చేసినట్లు కొన్ని రోజులనుండి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు అదే 'స్పైడర్' టైటిల్ ని మహేష్ కోసం ఆ చిత్ర నిర్మాతలు  ప్రసాద్, ఠాగూర్ మధు లు ఎన్వీఆర్ సినిమా బ్యానర్ పై  రిజిస్టర్ చేయించారట. అంటే ఇక మహేష్ చిత్రానికి 'స్పైడర్' టైటిలే ఫైనల్ అన్నమాట.

ఇక మరో యంగ్ హీరో అఖిల్ తన రెండో చిత్రాన్ని విక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. వీరి సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళక ముందే అఖిల్ చిత్ర టైటిల్ 'జున్ను' అంటూ ప్రచారం మొదలైంది. ఇక 'జున్ను' టైటిల్ నే ఇప్పుడు అఖిల్ కోసం రిజిస్టర్ చేయించారని సమాచారం. అయితే మరో టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారట. 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక' అనే టైటిల్ ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబందించిన ఎస్ ఎస్ క్రియేషన్స్ (సుమంత్ నిర్మాత)  వారు రిజిస్టర్ చేయించినట్లుగా సమాచారం. మరి అఖిల్ కి 'జున్ను, ఎక్కడ ఎక్కడ ఉందో తారక' లో ఏదో ఒకటి కన్ఫామ్ అవ్వవచ్చని చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ