Advertisementt

బాలయ్య కి నో చెప్పిన..ముద్దుగుమ్మ..!

Sun 02nd Apr 2017 08:47 PM
keerthi suresh,krishna vamsi,balakrishna,nbk 101 movie  బాలయ్య కి నో చెప్పిన..ముద్దుగుమ్మ..!
బాలయ్య కి నో చెప్పిన..ముద్దుగుమ్మ..!
Advertisement
Ads by CJ

'నేను శైలజ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ చేతికందిన అవకాశాలు దండుకుంటూ ఫుల్ స్పీడులో  పరుగెడుతోంది. ఈ మధ్యనే ఈ అమ్మడు గురించి ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి. కీర్తి సురేష్ ని ఇక నుండి ఏదైనా సినిమాకి హీరోయిన్ గా తీసుకోవాలంటే ఖచ్చితంగా మూడు కోట్ల రెమ్యునరేషన్ సమర్పించాల్సిందే అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అసలు ఇప్పటికే మూడు కోట్లు 'మహానటి' సినిమా కోసం కీర్తి  అందుకుంది కూడా చెబుతున్నారు.

ఇక ఇప్పుడు కీర్తి గురించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే కీర్తి సురేష్ ఒక సీనియర్ హీరో చిత్రంలో అవకాశం వస్తే  చేయలేనని తెగేసి చెప్పిందట. ఆ హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ అంట. బాలయ్య 101 వ చిత్రాన్ని కృష్ణ వంశి డైరెక్షన్ లో చేస్తానని చెప్పినప్పుడు కృష్ణ వంశి బాలకృష్ణ కి జోడిగా కీర్తి సురేష్ అయితే బావుంటుందని భావించి ఆమెని సంప్రదించగా... కీర్తి వారి మొహం మీదే తాను సీనియర్ హీరోలతో నటించనని చెప్పిందట. ఇప్పుడిప్పుడే యంగ్ హీరోలతో నటిస్తూ బిజీ అయిన తనకి కెరీర్ మొదట్లోనే సీనియర్ హీరోలతో నటిస్తే మళ్ళీ యంగ్ హీరోల పక్కన ఛాన్స్ లు పోతాయనే ఉద్దేశ్యంతోనే కీర్తి అలా చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్న మాట.

ఇప్పుడు కీర్తి తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తుండగా.... మహానటి చిత్రంలో సావిత్రి రోల్ లో నటిస్తుంది. ఇక తమిళంలో కూడా కీర్తి సురేష్ పలు అవకాశాలతో జెట్ స్పీడుతో దూసుకుపోతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ