Advertisementt

'గురు'నే కాదు... చాలా చిత్రాలున్నాయి!

Sun 02nd Apr 2017 08:38 PM
guru movie,venkatesh,trivikram srinivas,evv satyanarayana  'గురు'నే కాదు... చాలా చిత్రాలున్నాయి!
'గురు'నే కాదు... చాలా చిత్రాలున్నాయి!
Advertisement

తాజాగా విక్టరీ వెంకటేష్‌ ప్రధానపాత్ర పోషించిన చిత్రం 'గురు' విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. కాగా ఎప్పుడో రామోజీరావు నిర్మాతగా మౌళి దర్శకత్వంలో అశ్వనీనాచప్ప, భానుచందర్‌ ప్రదాన పాత్రల్లో వచ్చిన 'అశ్వని' చిత్రాన్ని ఇది పోలి ఉందనే విమర్శలు వస్తున్నాయి. కాగా భారతీయ సినిమాలను మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాల కథలను పరిశీలిస్తే మనకో సంగతి అవగతం అవుతుంది. ఇక్కడివారు విస్తృత స్థాయిలో ఆలోచించలేరు. అలా ఆలోచించినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం లేదు. మన కథలన్నీ ఎక్కడోక్కడ రామాయణం, మహాభారతం వంటి వాటిల్లోని పాయింట్లను పట్టుకొని తెచ్చేవే అధికం. ఇంకా కావాలంటే హాలీవుడ్‌, ఇతర దేశాల చిత్రాలు, ఇతర భాషా చిత్రాలను కాపీ కొట్టి, లేదా రీమేక్‌లు చేసుకునేవే అధికం. 

రామోజీరావు వంటి గట్స్‌ ఉన్న నిర్మాత కాబట్టి ఆనాడు 'అశ్వనీ, మయూరి, ప్రతిఘటన' వంటి చిత్రాలు వచ్చాయి. కానీ ఈ జనరేషన్‌ వారికి ఆ చిత్రాలు తెలియకపోవచ్చు. కాబట్టి వాటిని స్ఫూర్తిగా తీసుకొని బ్యాక్‌డ్రాప్‌ మార్చి నేటి తరానికి నచ్చే చిత్రాలను తీస్తూ ఉంటారు. ఎస్వీకృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ వంటి ఎందరో దర్శకుల నుంచి నేటి త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ వరకు చేసేది ఒక్కటే. పాత సారాను కొత్త సీసలో పోస్తారు. తమదైన శైలిలో కొత్తగా ప్రజెంట్‌చేసి అవార్డులు, రివార్డులు పొందుతారు. 

ఇక ఇవివి తీసిన 'ఆయనకిద్దరు' చిత్రంలోని క్లైమాక్స్‌ సీన్‌ ఏ పాత చిత్రంలోదో చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ ఆ చిత్రానికి క్లైమాక్సే పెద్ద ప్లస్‌ అయింది. ఇక ఇవివి నాగార్జున హీరోగా తీసిన 'హలో బ్రదర్‌' పెద్దహిట్‌. ఆ చిత్రంలో కోట, బాబూమోహన్‌ల పోలీసు పాత్రలకు పెద్ద రెస్పాన్స్‌ వచ్చింది. కానీ అంతకు ముందు ఈవివీ సత్యనారాయణ తన కెరీర్‌ మొదట్లో నాగబాబు (చిరు సోదరుడు) హీరోగా తీసిన '420' అనే చిత్రం బాగా ఆడలేదు. దాంతో ఈవీవీనే ఆ చిత్రంలోని కామెడీ ట్రాక్‌ను తన సినిమా నుంచి తానే కాపీ కొట్టుకుని 'హలోబ్రదర్‌'లో పెట్టారు. ఇక త్రివిక్రమ్‌ తీసిన నిన్నటి 'అ...ఆ' వరకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు..! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement