Advertisementt

చిరు, సచిన్‌ వంటి వారు భారం కారాదు..!

Sun 02nd Apr 2017 07:44 AM
rajya sabha,chiranjeevi,sachin tendulkar,politics  చిరు, సచిన్‌ వంటి వారు భారం కారాదు..!
చిరు, సచిన్‌ వంటి వారు భారం కారాదు..!
Advertisement

సినీ నటుల్లో చిరంజీవి ఎలాగో.. ప్రపంచ క్రికెట్‌కు దేవుడు సచిన్‌ టెండూల్కర్‌. కాగా వీరు వారి వారి వృత్తుల్లో నిష్ణాతులు. వీరిని పెద్దల సభకు పంపించింది ఎందుకు? అన్ని విషయాలలో కాకపోయినా తమకు అనుభవం ఉన్న రంగాలలో మంచి మంచి సలహాలిచ్చి, సినిమాల పరంగా చిరు, క్రీడాభివృద్దిలో సచిన్‌ వంటి వారు తమ అనుభవంతో మంచిని చేస్తారని అందరూ భావించారు. ఇలా రాజ్యసభకు ఎన్నికవ్వడం వల్ల ఎంపీలుగా 

వారికి జీవితాంతం, జీవితానంతరం కూడా ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలుంటాయి. ఎలాగూ ఎలక్షన్లలో గెలవలేరు కాబట్టి వారిని పెద్దల సభ అయిన రాజ్యసభకు పంపారు. కానీ నేడు రాజ్యసభకు వచ్చే వారిని చూస్తుంటే నవ్వు రాకమానదు. ఆవేదన కూడా కలుగుతుంది, ప్రజల సొమ్మును అప్పనంగా జీతభత్యాలు, టీఏల రూపంలో వివిధ వసతుల రూపంలో పొందే వీరు కనీసం సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. ఏ విషయంపై కూడా చర్చ సమయంలో కనిపించడంలేదు. పార్టీలు తప్పనిసరిగా రావాలని విప్‌ జారీ చేస్తే గానీ వీరు సమావేశాలకు రారు. 

మరి ఇలాంటి వారెందరో రాజ్యసభలో ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులకు అది ఒక వసతి గృహంలా మారిందనే చెప్పాలి. పెద్దల సభ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. అవసరమైతే తమ వ్యక్తిగతవిషయాలలో, సినిమా షూటింగ్‌లలో, క్రికెట్‌ ఫంక్షన్లలో, భారీ పారితోషికాలు తీసుకొని సచిన్‌ వంటివారు వ్యాసాలు రాయడానికి చూపే శ్రద్ద కనీసం రాజ్యసభ సమావేశాలకు రాకపోవడం ఆశ్చర్యకరం. వీలుంటే.. కేంద్రంలో ప్రభుత్వాలు మారితే చిరు, దాసరి, వెంకయ్యలాగా మంత్రి పదవులను మాత్రం వెలగబెడతారు. ఇక స్వర్గీయ ఎన్టీఆర్‌ శాసనమండలిని ఓ పనికిరాని ఆరో వేలుగా భావించి రద్దు చేశారు. కానీ రాష్ట్రానికి మంచి చేయడానికి వచ్చామని చెప్పే వైఎస్‌, చంద్రబాబు వంటి వారు ఈనాడు శాసనమండలికి ఆకేదో, పువ్వు ఏదో తెలియని వారిని పంపుతున్నారు. పెద్దల సభ అంటే ఇదేనా...?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement