Advertisementt

సమంత ఇంకోటేసుకుంటుందా..!

Sun 02nd Apr 2017 01:41 AM
samantha,samantha in jai lava kusa movie,samantha with jr ntr,samantha movies  సమంత ఇంకోటేసుకుంటుందా..!
సమంత ఇంకోటేసుకుంటుందా..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, సమంతలు మొదటిసారి జంటగా బృందావనం చిత్రంలో నటించారు. ఆ చిత్రం అప్పడు హిట్ అయ్యింది. మళ్ళీ తర్వాత రభస, రామయ్య వస్తావయ్యా చిత్రాల్లో నటించిన ఈ జంట ఆఖరిగా జనతా గ్యారేజ్ లో నటించారు. ఆ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమా విడుదలవడం.. సమంత - నాగ చైతన్య ప్రేమ విషయం బయటికి పొక్కడం తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం అన్ని జరిగిపోయాయి. ఇక అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టే సమంత కు ఉన్నట్టుండి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో సమంత హవా  టాలీవుడ్ లో ఇక అయిపోయిందన్న తరుణంలో వరుస అవకాశాలు సమంతను ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

సమంత ఇప్పుడు తాజాగా 'రాజుగారు గది 2'  లో ఒక కీలక పాత్రలో చేస్తుండగా... మహానటిలో కూడా ప్రధానమైన పాత్రకి ఎంపికైంది. అంతేకాకుండా రామ్ చరణ్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి తన హవా టాలీవుడ్ లో ఇంకా కొనసాగుతుందని తెలియజేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కొత్త చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్ లో తెరకెక్కే 'జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నాడని తెలిసిన విషయమే. ఇక హీరోయిన్స్ గా ఒక్క రాశి ఖన్నా ని తప్ప మిగతా ఇద్దరినీ ఇప్పటివరకు ఫైనల్ చెయ్యని చిత్ర యూనిట్ మరో హీరోయిన్ గా నివేత థామస్ ని ఎంపిక చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా సమంత కోసం చర్చలు జరుపున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే  ఈ చర్చలు సఫలం అయ్యి సమంత, ఎన్టీఆర్ కొత్త చిత్రంలో నటిస్తే మళ్ళీ సమంత టాలీవుడ్ మరొక్కటి పట్టేసినట్లే కదా.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ